హైదరాబాద్ జాతీయ పోలీస్ అకాడమీ పరిధిలో శిక్షణ పొందుతున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్‌కృష్ణారెడ్డి వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది. కేసు నమోదు, తీవ్ర ఒత్తిడి నేపథ్యంలో ఆయన లేఖ రాసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది.

హైదరాబాద్ శివార్లలోని జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న కర్ణాటకకు చెందిన ఓ ట్రైనీ మహిళా ఐపీఎస్ అధికారిణి, తన బ్యాచ్‌మేట్ అయిన ఉదయ్‌కృష్ణారెడ్డిపై ఇటీవల తీవ్ర ఆరోపణలు చేశారు. అకాడమీలో ఉదయ్ తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఆమె అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మోతీనగర్‌లోని తన బంధువుల నివాసానికి వచ్చిన ఉదయ్‌కృష్ణారెడ్డి, శానిటైజర్ తాగి బలవన్మరణానికి ప్రయత్నించారు. అయితే ఆత్మహత్యాయత్నానికి ముందు ఆయన రాసిన ఒక లేఖ లభ్యమవడంతో ఈ కేసులో కొత్త కోణం వెలుగుచూసింది. సదరు ట్రైనీ మహిళా ఐపీఎస్‌తో తనకు గత ఏడాది కాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. వారిద్దరి మధ్య ఉన్న సంబంధానికి సంబంధించిన వీడియో ఆధారాలు కూడా తన వద్ద భద్రంగా ఉన్నాయని ఆయన లేఖలో ప్రస్తావించారు.
ఉదయ్‌కృష్ణారెడ్డి శానిటైజర్ తాగిన వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు గురై ఆయనను వెంటనే ఎస్‌ఆర్ నగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడ అత్యవసర చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై ఎస్‌ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. లభించిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, లేఖలోని అంశాలు నిజమేనా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలో ఐపీఎస్ ట్రైనీ అధికారుల మధ్య ఇలాంటి వివాదం చోటుచేసుకోవడం పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాకు చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి జర్నీ కూడా తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి ఆదర్శంగా నిలిచారు. తల్లిదండ్రులు లేకపోవడంతో నానమ్మ వద్దే ఉంటూ చదువు కొనసాగించారు. 2013లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. అయితే ఓ సీఐ తోటివారి ముందు అవమానించడంతో 2018లో ఉద్యోగానికి రిజైన్ చేసి సివిల్స్ సాధించటమే లక్ష్యంగా ప్రిపరేషన్ మొదలుపెట్టారు. 4సార్లు ఫెయిల్ అయినా ఐదోసారి 360 ర్యాంకుతో ఐపీఎస్ సాధించారు. ట్రైనింగ్ త్వరలో ముగించుకోవాల్సి ఉండగా.. ఇప్పుడు ఈ కేసు సంచలనంగా మారింది.
{{/usCountry}}ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాకు చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి జర్నీ కూడా తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి ఆదర్శంగా నిలిచారు. తల్లిదండ్రులు లేకపోవడంతో నానమ్మ వద్దే ఉంటూ చదువు కొనసాగించారు. 2013లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. అయితే ఓ సీఐ తోటివారి ముందు అవమానించడంతో 2018లో ఉద్యోగానికి రిజైన్ చేసి సివిల్స్ సాధించటమే లక్ష్యంగా ప్రిపరేషన్ మొదలుపెట్టారు. 4సార్లు ఫెయిల్ అయినా ఐదోసారి 360 ర్యాంకుతో ఐపీఎస్ సాధించారు. ట్రైనింగ్ త్వరలో ముగించుకోవాల్సి ఉండగా.. ఇప్పుడు ఈ కేసు సంచలనంగా మారింది.
{{/usCountry}}