IIT హైదరాబాద్‌లో ఉద్యోగ ఖాళీలు - మంచి జీతం, కేవలం ఇంటర్వ్యూనే...!

ఐఐఐటీ హైదరాబాద్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా జూనియర్ ఇంజినీరింగ్ ఖాళీలను భర్తీ చేస్తారు. మొత్తం 4 ఖాళీలున్నాయి. https://www.iith.ac.in/ వెబ్ సైట్ నుంచి

Published on: Dec 10, 2025, 13:07:30 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, హైదరాబాద్‌ నుంచి ఉద్యోగ ప్రకటన జారీ అయింది. ఇందులో భాగంగా జూనియర్ ఇంజినీర్‌ పోస్టులను రిక్రూట్ చేస్తారు. ఈ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. మొత్తం 4 పోస్టులుండగా….జూనియర్ ఇంజినీర్‌(ఎలక్ట్రికల్‌) కింద 2 ఉండగా… మరో 2 పోస్టులు సివిల్‌ విభాగంలో ఉన్నాయి.

ఐఐటీ హైదరాబాద్ ఉద్యోగాలు
ఐఐటీ హైదరాబాద్ ఉద్యోగాలు

ఐఐటీ హైదరాబాద్ నోటిఫికేషన్ - ముఖ్యమైన వివరాలు:

  • నోటిఫికేషన్ - ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, హైదరాబాద్‌
  • ఉద్యోగాలు -జూనియర్ ఇంజినీర్‌ పోస్టులు
  • మొత్తం ఖాళీలు - 04 (జూనియర్ ఇంజినీర్‌(ఎలక్ట్రికల్‌) 02, జూనియర్‌ ఇంజినీర్‌(సివిల్‌) 02)
  • పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్(ఎలక్ట్రికల్, సివిల్)లో ఉత్తీర్ణత ఉండాలి. పని చేసిన తప్పకుండా అనుభవం ఉండాలి.
  • ఈ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేస్తారు.
  • దరఖాస్తు విధానం - అప్లికేషన్ ఫారమ్ డౌన్లోడ్ చేసుకొని వివరాలను నింపాలి.
  • ఎంపిక విధానం - ఇంటర్వ్యూ ఆధారంగా తుది జాబితాను ప్రకటిస్తారు.
  • ఎంపికైన వారికి నెలకు రూ.50,000 జీతం చెల్లిస్తారు.
  • ఇంటర్వ్యూ తేదీలు - డిసెంబర్‌ 22, 23.
  • ఇంటర్వ్యూ జరిగే ప్రాంతం - రూమ్ నెంబర్ 405, ఫోర్త్ ఫ్లోర్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, ఐఐఐటీ హైదరాబాద్, కంది,సంగారెడ్డి, తెలంగాణ -502284
  • ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థులు ఉదయం 9 గంటలకే రిపోర్టింగ్ చేయాలి. ఏదైనా ప్రభుత్వ గుర్తింపు ఉన్న ఐడీ కార్డు తీసుకొని రావాలి.
  • అధికారిక వెబ్ సైట్ - https://iith.ac.in/careers/
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More