IIT Hyderabad Non Teaching Recruitment 2026 : ప్రతిష్టాత్మక జాతీయ విద్యాసంస్థ అయిన 'ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ' (IIT) హైదరాబాద్ నుంచి ఉద్యోగ ప్రకటన జారీ అయింది. ఖాళీగా ఉన్న పలు గ్రూప్-బి, గ్రూప్-సి కేటగిరీలకు చెందిన నాన్-టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకోసం అర్హులైన వారి నుంచి ఆన్ లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. మొత్తం 21 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
- జూనియర్ ఇంజినీర్ (సివిల్): 01 పోస్టు
- జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్): 01 పోస్టు
- ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్ (పీటీఐ): 02 పోస్టులు
- అకౌంటెంట్: 5 పోస్టులు
- జూనియర్ టెక్నీషియన్ : వివిధ సాంకేతిక విభాగాల్లో కలిపి మొత్తం 12 పోస్టులు ఉన్నాయి.

అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే పోస్టును బట్టి సంబంధిత సబ్జెక్టు లేదా ట్రేడ్‌లో ఐటీఐ (ITI), డిప్లొమా, బీఈ/బీటెక్ (B.E/B.Tech), బి.పి.ఎడ్ లేదా కామర్స్/ఫైనాన్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. విద్యార్హతలతో పాటు నోటిఫికేషన్‌లో నిర్దేశించిన విధంగా ఆయా రంగాలలో కనీస పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 35 ఏళ్లు మించకూడదు (దరఖాస్తు ముగింపు తేదీ నాటికి). కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు గరిష్ఠ వయస్సులో సడలింపు ఉంటుంది. దీని ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ (NCL) అభ్యర్థులకు 3 ఏళ్లు, దివ్యాంగులకు (PwD) వారి కేటగిరీని బట్టి 10 నుండి 15 ఏళ్ల వరకు వయో సడలింపు లభిస్తుంది.
అప్లికేషన్ ప్రాసెస్….
అర్హులైన అభ్యర్థులు ఐఐటీ హైదరాబాద్ అధికారిక కెరీర్ పోర్టల్ ( https://www.iith.ac.in/careers/ ) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు రుసుముగా రూ.500 చెల్లించాలి. ఎస్సీ (SC), ఎస్టీ (ST), దివ్యాంగులు (PwD), ఈడబ్ల్యూఎస్ (EWS), మాజీ సైనికులు.మహిళా అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు రుసుము లేదు. వారు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. జూలై 20, 2026 తేదీని తుది గడువుగా నిర్ణయించారు.
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మూడు అంచెల్లో పారదర్శకంగా జరుగుతుంది. మొదట ప్రిలిమినరీ రాత పరీక్ష (స్క్రీనింగ్ టెస్ట్) నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ చూపిన వారికి స్కిల్ టెస్ట్ లేదా ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. చివరిగా నిర్వహించే ఫైనల్ రాత పరీక్షలో సాధించిన మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను తుది ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
{{/usCountry}}అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మూడు అంచెల్లో పారదర్శకంగా జరుగుతుంది. మొదట ప్రిలిమినరీ రాత పరీక్ష (స్క్రీనింగ్ టెస్ట్) నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ చూపిన వారికి స్కిల్ టెస్ట్ లేదా ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. చివరిగా నిర్వహించే ఫైనల్ రాత పరీక్షలో సాధించిన మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను తుది ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
{{/usCountry}}