IIT Hyderabad Recruitment : ఐఐటీ హైదరాబాద్‌ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ - దరఖాస్తులకు చివరి తేదీ ఇదే!

IIT Hyderabad Recruitment Drive 2026 : ఐఐటీ హైదరాబాద్‌ ఒప్పంద ప్రాతిపదికన డ్యూటీ మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్‌లైన్ దరఖాస్తులకు సెప్టెంబరు 17 చివరి తేదీ.

Published on: Sep 14, 2026, 09:59:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

IIT Hyderabad Recruitment Drive 2026 : భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ (IIT Hyderabad) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఆసుపత్రి విభాగంలో ఒప్పంద (కాంట్రాక్ట్) ప్రాతిపదికన పనిచేసేందుకు అర్హులైన భారతీయ పౌరుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ప్రకటన ద్వారా డ్యూటీ మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేస్తారు.

ఐఐటీ హైదరాబాద్ ఉద్యోగ ప్రకటన
ఐఐటీ హైదరాబాద్ ఉద్యోగ ప్రకటన

ఖాళీల వివరాలు…

  • డ్యూటీ మెడికల్ ఆఫీసర్ : 02 పోస్టులు (EWS - 01, UR - 01). వీరికి నెలకు రూ.60,000 స్థిర వేతనం చెల్లిస్తారు.
  • స్టాఫ్ నర్స్ (Staff Nurse): 03 పోస్టులు (EWS - 01, UR - 02). వీరికి నెలకు రూ.35,000 వేతనం లభిస్తుంది.

విద్యా అర్హతలు…

డ్యూటీ మెడికల్ ఆఫీసర్ : అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎంబీబీఎస్ (MBBS) ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్న్‌షిప్ పూర్తి చేసి, మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి. కనీసం ఒక సంవత్సరం పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. అయితే కొత్తగా కోర్సు పూర్తి చేసిన ఫ్రెషర్స్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

స్టాఫ్ నర్స్ : ఇంటర్మీడియట్ (10+2) తో పాటు జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ (GNM) 3 ఏళ్ల కోర్సు లేదా బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణులై ఉండాలి. సెంట్రల్/స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ గుర్తింపు పొందిన ఆసుపత్రిలో కనీసం 3 ఏళ్ల పని అనుభవం ఉండాలి. క్యాజువాలిటీ, ఐసీయూ (ICU), మెడికల్/సర్జికల్ వార్డుల్లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.

దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ నాటికి డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టుకు గరిష్ఠ వయస్సు 40 ఏళ్లు, స్టాఫ్ నర్స్ పోస్టుకు 35 ఏళ్లు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

ఎంపిక విధానం…

అభ్యర్థులను రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపిక ప్రక్రియ ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లోనే జరుగుతుంది. అర్హులైన అభ్యర్థులు ఐఐటీ హైదరాబాద్ అధికారిక వెబ్‌సైట్ ( https://careers.iith.ac.in/jobs ) ద్వారా కేవలం ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు సమర్పించాలి. ఆఫ్‌లైన్ దరఖాస్తులను స్వీకరించరు. ఈనెల 17వ తేదీలోపు అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More