...
...
Next Story

IIT Hyderabad Recruitment : ఐఐటీ హైదరాబాద్‌లో ల్యాబ్‌ హెల్పర్‌ ఉద్యోగాలు - వెంటనే అప్లయ్ చేసుకోండి

IIT Hyderabad Recruitment 2026 :ఐఐటీ హైదరాబాద్‌ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా ల్యాబ్ హెల్పర్ పోస్టులను రిక్రూట్ చేస్తారు. అర్హులైన అభ్యర్థులు మార్చి 2వ తేదీలోపు అప్లయ్ చేసుకోవాలి.

Published on: Mar 1, 2026, 10:26:58 IST
Advertisement

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో ల్యాబ్ హెల్పర్ పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. రెండు ఖాళీలున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసే ఈ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.

ఐఐటీ హైదరాబాద్‌ ఉద్యోగ నోటిఫికేషన్
ఐఐటీ హైదరాబాద్‌ ఉద్యోగ నోటిఫికేషన్

కేంద్ర లేదా రాష్ట్రానికి చెందిన సంస్థల్లో స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ ల్యాబ్ పరికరాల నిర్వహణలో కనీసం ఒక ఏడాది అనుభవం ఉండాలి. వెల్డింగ్, కటింగ్ & డ్రిల్లింగ్‌లో నైపుణ్యం తప్పనిసరి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థి వయసు 30 ఏళ్ల లోపు ఉండాలి.

ఈ పోస్టకు ఎంపికైన వారికి నెలకు రూ.15,000 నుంచి రూ.25,000 వరకు జీతం చెల్లిస్తారు. ఎంపికైన వారు… ల్యాబ్ పరీక్షల కోసం స్టీల్ శాంపిల్స్‌ను వెల్డింగ్, కటింగ్ అండ్ డ్రిల్లింగ్ ద్వారా సిద్ధం చేయడం, ల్యాబ్ టీమ్ తో కలిసి పనిచేయడం వంటి విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం…

  • అభ్యర్థులు https://www.iith.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • కెరీర్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే Temporary Positions లో ఈ ఉద్యోగ నోటిఫికేషన్ అందుబాటులో ఉంటుంది.
  • నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేసి పీడీఎఫ్ ఓపెన్ అవుతుంది. ఇందులోనే గూగుల్ అప్లికేషన్ లింక్ ఉంటుంది.
  • దీనిపై క్లిక్ చేసి మీ వివరాలను నమోదు చేసుకోవాలి.
  • దీంతో మీ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.
  • అర్హులైన అభ్యర్థులు మార్చి 2, 2026వ తేదీలోపే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి. గడువు పొడిగింపు ఉండదు.

సెలెక్షన్ ప్రాసెస్….

ఈ లింక్ పై క్లిక్ చేసి ఉద్యోగ నోటిఫికేషన్ పీడీఎఫ్ ను పొందొచ్చు

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks