...
...
Next Story

భారీ వర్ష హెచ్చరిక.. ఆఫీసు నుంచి ముందుగానే బయటకు వెళ్లాలని పోలీసులు సూచన

తెలంగాణలో పలు ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయి. అయితే వర్ష హెచ్చరిక నేపథ్యంలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ అప్డేట్ ఇచ్చింది. ఉద్యోగులు మధ్యాహ్నం 3:30 గంటల నుండి ఇంటికి వెళ్లాలని కోరింది.

Published on: Jun 22, 2026, 16:56:30 IST
Advertisement

ఉద్యోగులకు సైబరాబాద్ పోలీసులు ఒక ముఖ్యమైన హెచ్చరిక జారీ చేశారు. 2026, జూన్ 22వ తేదీ సోమవారం సాయంత్రం నగరంలో మోస్తరు నుండి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రోడ్లపై తీవ్రమైన ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడకుండా, ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ ఒక అధికారిక 'వెదర్ అలర్ట్ అండ్ ట్రాఫిక్ అడ్వైజరీ'ని విడుదల చేసింది.

భారీ వర్ష సూచన
భారీ వర్ష సూచన

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విడుదల చేసిన ఈ అడ్వైజరీ ప్రకారం... గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, చందానగర్ వంటి ఐటీ హబ్‌లలో పనిచేసే కంపెనీలు, విద్యాసంస్థలు, ఇతర సంస్థలు తమ ఉద్యోగులకు విడతల వారీగా మధ్యాహ్నం 3:30 గంటల నుంచే ముందస్తు లాగౌట్ సౌకర్యం కల్పించాలని కోరారు. దీనివల్ల రోడ్లపై ట్రాఫిక్ తగ్గి, అత్యవసర సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉంటుందని పోలీసులు తెలిపారు.

వాతావరణ శాఖ (IMD) నివేదికల ప్రకారం, హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాలలో రాబోయే 24 గంటల పాటు ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. నగరంలో బలమైన గాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు లేదా భారీ వర్షాలు/ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల వడగాల్పుల తీవ్రత కూడా ఉండవచ్చని ఐఎండి పేర్కొంది.

ప్రయాణ సమయాల్లో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు వాహనదారులు, ఐటీ ఉద్యోగులు వాతావరణ అప్‌డేట్లను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe