తెలంగాణలో వరదలను ముందస్తుగా అంచనా వేసేందుకు అధునాతన న్యూమెరికల్ వెదర్ ప్రిడిక్షన్ మోడళ్లతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను వినియోగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు తెలిపింది. వాతావరణ సమాచారం, వరద నిర్వహణపై రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

గోదావరి, కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో వరద హెచ్చరికల వ్యవస్థలు, భూకంప గుర్తింపు కేంద్రాల విస్తరణ, రైతులకు అందించే వ్యవసాయ-వాతావరణ సూచనలపై ఎంపీ కోరిన సమాచారం మేరకు కేంద్ర మంత్రి వివరాలను వెల్లడించారు.
ప్రతిపాదిత ప్రాజెక్టులు, కీలక ప్రాంతాలలో వరద ముందస్తు సమాచారాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు చేరవేసే బాధ్యతను సెంట్రల్ వాటర్ కమిషన్ నిర్వహిస్తోందని కేంద్రమంత్రి తెలిపారు. భారతదేశ వ్యాప్తంగా భారత వాతావరణ శాఖ (IMD) 25 ఫ్లడ్ మెటియోరోలాజికల్ ఆఫీసులను నడుపుతోందన్నారు. ఇవి దేశంలోని 220 సబ్-బేసిన్లకు ఏడు రోజుల వ్యవధితో రోజువారీ వర్షపాత అంచనాలను అందిస్తాయని పేర్కొన్నారు. ఈ అంచనాల తయారీలో ఐఎమ్‌డీ ఏఐ, గణాంక వాతావరణ మోడళ్లను ఉపయోగిస్తోంది.
నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తమ 'నేషనల్ సీస్మోలాజికల్ నెట్‌వర్క్' (NSN) ద్వారా దేశవ్యాప్తంగా భూకంప కార్యకలాపాలను పర్యవేక్షిస్తుందని కేంద్రమంత్రి చెప్పారు. ప్రస్తుతం తెలంగాణలోని హైదరాబాద్‌లో ఒక సీస్మోలాజికల్ అబ్జర్వేటరీ అందుబాటులో ఉందన్నారు. ఈ నెట్‌వర్క్ ద్వారా తెలంగాణ పరిధిలో రిక్టర్ స్కేలుపై 3.0, అంతకంటే ఎక్కువ తీవ్రతతో వచ్చే భూకంపాలను సులభంగా గుర్తించవచ్చన్నారు.
ఐఎండీ క్రమం తప్పకుండా అందిస్తున్న వ్యవసాయ-వాతావరణ సూచనల ద్వారా రాష్ట్రంలోని రైతులకు మేలు జరుగుతోందని చెప్పారు. పంచాయత్ మాసమ్ సేవా పోర్టల్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా బ్లాక్, పంచాయతీ స్థాయిలలో వాతావరణ సమాచారాన్ని అందిస్తున్నట్టుగా వెల్లడించారు. ఈ సూచనలను వాట్సాప్‌తో పాటు కృషి సఖీలు, పశు సఖీల వంటి క్షేత్రస్థాయి యంత్రాంగం ద్వారా రైతులకు వేగంగా చేరవేస్తున్నారని తెలిపారు.
{{/usCountry}}ఐఎండీ క్రమం తప్పకుండా అందిస్తున్న వ్యవసాయ-వాతావరణ సూచనల ద్వారా రాష్ట్రంలోని రైతులకు మేలు జరుగుతోందని చెప్పారు. పంచాయత్ మాసమ్ సేవా పోర్టల్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా బ్లాక్, పంచాయతీ స్థాయిలలో వాతావరణ సమాచారాన్ని అందిస్తున్నట్టుగా వెల్లడించారు. ఈ సూచనలను వాట్సాప్‌తో పాటు కృషి సఖీలు, పశు సఖీల వంటి క్షేత్రస్థాయి యంత్రాంగం ద్వారా రైతులకు వేగంగా చేరవేస్తున్నారని తెలిపారు.
{{/usCountry}}