తెలంగాణలో అక్టోబర్ 30 శుక్రవారం నాడు వర్షాలు పడే అవకాశం ఉంది. సాయంత్రం, రాత్రి వేళల్లో పలు జిల్లాల్లో చెదురుమదురుగా మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. యాదాద్రి-భువనగిరి, జనగాం, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం ఉదయం వరకు వానలు పడే అవకాశం ఉంది.

ముఖ్యంగా రాత్రి సమయంలో చెదురుమదురుగా మోస్తరు వర్షాలు, ఉరుములు సంభవించే అవకాశం ఉంది. రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, సంగారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం ఉదయం వరకు కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాల తీవ్రత రాత్రిపూట ఎక్కువగా ఉంటుందని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.
మరో అల్పపీడనం
అర్నబ్ తుపాను సృష్టించిన బీభత్సం, వర్షాల ప్రభావం నుంచి ఏపీ ప్రజలు ఇంకా తేరుకోకముందే బంగాళాఖాతం మరోసారి అల్లకల్లోలంగా మారింది. సముద్రంలో సంభవించిన వాతావరణ మార్పుల కారణంగా కొత్తగా మరో అల్పపీడనం ఏర్పడినట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది.
బుధవారం నాటికి దక్షిణ అండమాన్ సముద్రం దానిని ఆనుకుని ఉన్న పరిసర ప్రాంతాల్లో బలమైన ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో గురువారం ఉదయానికి అదే ప్రాంతంలో కేంద్రీకృతమై ఒక అల్పపీడనంగా రూపాంతరం చెందిందని అధికారులు వెల్లడించారు.
ఈ అల్పపీడన వ్యవస్థ మరింత బలపడుతూ వాయువ్య దిశగా పయనించే అవకాశాలు ఉన్నాయని ఐఎమ్‌డీ వెల్లడించింది. అల్పపీడనం తీవ్రరూపం దాల్చనుంది. ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న అండమాన్-నికోబార్ దీవులు, అండమాన్ సముద్ర ప్రాంతాల్లో ఇది వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇది తుపానుగా మారే అవకాశం ఉందా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఈ కొత్త వాతావరణ పరిణామాన్ని వాతావరణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో అత్యంత అలజడిగా ఉండే అవకాశం ఉన్నందున, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే అర్నబ్ తుపాను వల్ల తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు నమోదయ్యాయి. తెలంగాణలోని కొన్ని ప్రంతాల్లోనూ వానలు పడ్డాయి. హైదరాబాద్‌లో వాతావరణం చల్లగా ఉంది.
{{/usCountry}}ఇది తుపానుగా మారే అవకాశం ఉందా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఈ కొత్త వాతావరణ పరిణామాన్ని వాతావరణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో అత్యంత అలజడిగా ఉండే అవకాశం ఉన్నందున, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే అర్నబ్ తుపాను వల్ల తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు నమోదయ్యాయి. తెలంగాణలోని కొన్ని ప్రంతాల్లోనూ వానలు పడ్డాయి. హైదరాబాద్‌లో వాతావరణం చల్లగా ఉంది.
{{/usCountry}}