తెలంగాణ రాష్ట్రంలో ఎండ తీవ్రత మునుపెన్నడూ లేని విధంగా ముదురుతోంది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏకంగా 19 జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్‌ను దాటగా, 82 ప్రాంతాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచాయి.

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంఘం (TSDPS) అధికారిక గణాంకాల ప్రకారం.. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు అత్యధికంగా నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌లో 46.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
ఎక్కడెక్కడ ఎంతెంత ఎండ?
- 46.4 డిగ్రీలు: హనుమకొండ (ధర్మసాగర్), కరీంనగర్ (చొప్పదండి), పెద్దపల్లి (ఓదెల).
- 46.3 డిగ్రీలు: జగిత్యాల (రైకల్), జనగామ టౌన్, ఖమ్మం (పెనుబల్లి), కుమురం భీం (ఆసిఫాబాద్), మంచిర్యాల (కోటపల్లి), నిజామాబాద్ (బాల్కొండ).
ఉత్తర తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45.8 నుండి 46 డిగ్రీల వరకు నమోదవగా, మిగిలిన జిల్లాల్లో 41 నుండి 45 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. రాజధాని హైదరాబాద్‌లోనూ 41 డిగ్రీల నుండి 42.4 డిగ్రీల సెల్సియస్ వరకు ఎండ తీవ్రత కొనసాగింది.
ముఖ్యంగా జనగామ, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో అత్యంత తీవ్రమైన వడగాల్పులు వీచినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. వడదెబ్బతో ఒకే రోజు రాష్ట్రవ్యాప్తంగా 11 మంది మృతి చెందారు. 25 వరకు వడగాలులు వీస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది. పగలు ఎండవేడి సమయంలో బయట తిరగరాదని ప్రజలకు వాతావరణ శాఖ సూచించింది.
మరోవైపు నైరుతి రుతుపవనాల రాక ఆశాజనకంగా ఉందని ఐఎండీ అంచనా వేసింది. మూడు నాలుగు రోజుల్లో తూర్పు, మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది. భూమికి 900 మీటర్ల ఎత్తులో ఉత్తర్‌ప్రదేశ్ నుంచి ఉత్తర తెలంగాణ వరకూ ఉపరితలద్రోణి ఉన్నది. దీంతో రాష్టరంలో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది.
సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
భారత వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజల ప్రాణరక్షణే ధ్యేయంగా కింది కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సరిపడా ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలన్నారు. ఎండల దృష్ట్యా నిరంతర తాగునీటి సరఫరా, అంతరాయం లేని విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో ఉచిత చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు.
వడదెబ్బ బారిన పడి ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పారు సీఎం. మధ్యాహ్నం వేళల్లో ప్రజలు అనవసరంగా బయటకు రావద్దని, ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సీఎం కోరారు. జిల్లాల్లో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని చీఫ్ సెక్రటరీ కే. రామకృష్ణారావును సీఎం ఆదేశించారు.
{{/usCountry}}వడదెబ్బ బారిన పడి ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పారు సీఎం. మధ్యాహ్నం వేళల్లో ప్రజలు అనవసరంగా బయటకు రావద్దని, ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సీఎం కోరారు. జిల్లాల్లో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని చీఫ్ సెక్రటరీ కే. రామకృష్ణారావును సీఎం ఆదేశించారు.
{{/usCountry}}