తెలంగాణ వెదర్ రిపోర్ట్ - ఈ తేదీ తర్వాత 'చలి తీవ్రత' తగ్గే ఛాన్స్...!
రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతోంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలతో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే ఈ డిసెంబర్ 31వ తేదీ తర్వాత చలి తీవ్రత తగ్గే సూచనలున్నాయి.
రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతోంది. పలుచోట్ల సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ముఖ్యంగా ఉదయం, రాత్రి సమయాల్లో పొగమంచు కురుస్తోంది. ఉదయం సమయంలో బయటికి రావాలంటే కూడా జనాలు ఇబ్బందిపడుతున్నారు. సాయంత్రం 5 దాటితే చీకటి పడుతుండగా… చలి తీవ్రత మొదలవుతున్న పరిస్థితులున్నాయి.

చలి తగ్గే అవకాశం….!
ఈ వారమంతా చలి తీవ్రత ఉన్నప్పటికీ… ఆ తర్వాత తగ్గే అవకాశం ఉంది. తెలంగాణ వెదర్ మ్యాన్ పోస్ట్ ప్రకారం…. 25 రోజుల పాటు చలి తీవ్రత ఎక్కువగా కనిపించిందని పేర్కొంది. ఈనెల 31వ తేదీతో తగ్గే అవకాశం ఉందని తెలిపింది. ఆ తర్వాత సాధారణ చలి ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇంతటితో చలి పూర్తి అయినట్లు కాదని…. జనవరి 4వ వారం వరకు కూడా చలి ఉంటుందని వివరించింది. ప్రస్తుతం ఉన్న వెదర్ లో అయితే మార్పు ఉంటుందని పేర్కొంది.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం రిపోర్ట్ ప్రకారం... రాబోయే 2 రోజుల్లో అక్కడక్కడ కనిష్ణ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎలాంటి హెచ్చరికలు లేవు. ఇక రాబోయే రోజులంతా కూడా పొడి వాతావరణ పరిస్థితులు మాత్రమే ఉండే అవకాశం ఉంది. ఎలాంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది.
హైదరాబాద్ సిటీలో చూస్తే రాత్రి సమయంలో పొగమంచుతో కూడిన పరిస్థితులు ఏర్పడే సూచనలున్నాయి. ఉపరితల గాలులు ఈశాన్య దిశలో గంటకు 04 నుంచి 06 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉంటుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

