Telangana Rains : రాష్ట్రమంతటా విస్తరించిన రుతుపవనాలు - 5 రోజులపాటు భారీ వర్షసూచన! జిల్లాల వారీగా హెచ్చరికలు

Telangana Heavy Rain Alert : రాష్ట్రంలో ఐదు రోజుల పాటు విస్తారంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Published on: Jun 24, 2026, 08:58:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Telangana Heavy Rain Alert : రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో ఈ ఐదు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటన చేసింది. తాజా వాతావరణ హెచ్చరికల బులిటెన్ ప్రకారం.... రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయి. రానున్న నాలుగు రోజుల్లో రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుండి 5 డిగ్రీల సెల్సియస్ వరకు క్రమంగా తగ్గే అవకాశం ఉంది.

రాష్ట్రమంతటా విస్తరించిన రుతుపవనాలు
రాష్ట్రమంతటా విస్తరించిన రుతుపవనాలు

భారీ వర్ష సూచన - ఈ జిల్లాలకు హెచ్చరికలు

  • జూన్ 24 ఉదయం నుండి జూన్ 25 ఉదయం వరకు : రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే వీలుంది. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురువొచ్చు. అన్ని జిల్లాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి.
  • జూన్ 25 ఉదయం నుండి జూన్ 26 ఉదయం వరకు: వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో పాటు బలమైన గాలులు వీస్తాయి.
  • జూన్ 26 ఉదయం నుండి జూన్ 27 ఉదయం వరకు : ఈ 24 గంటల వ్యవధిలో ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి.
  • జూన్ 27 ఉదయం నుండి జూన్ 28 ఉదయం వరకు: దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కూడా వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.

ఆ తర్వాతి రెండు రోజులు (జూన్ 28 నుండి జూన్ 30 వరకు) కూడా రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. వర్షాలు కురిసే సమయంలో ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద నిలబడకూడదని అధికారులు సూచించారు.

ఇక రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు కురిశాయి. పెద్దపల్లి జిల్లా కూనారంలో అత్యధికంగా 17.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించాయి.

మొయినాబాద్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, శంషాబాద్ మండలాల్లోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. హైదరాబాద్ లోనే కాకుండా సంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, జగిత్యాల, ములుగు, ఆదిలాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. పెద్దపల్లి జిల్లా కూనారపలో 17 సెం.మీ వర్షపాతం నమోదైంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More