రాష్ట్రంలో రాబోయే ఆరు రోజుల పాటు వర్షాలు దంచికొట్టనున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం…. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉంది.
తేదీల వారీగా వర్ష సూచనలు ఇలా:
- సెప్టెంబర్ 18 - 19: రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.
- సెప్టెంబర్ 19 - 20: ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.
- సెప్టెంబర్ 20 - 21: ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
- సెప్టెంబర్ 21 - 22: కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
- సెప్టెంబర్ 22 - 23: మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదు కావచ్చు.
- సెప్టెంబర్ 23 - 25: రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

{{^htLoading}} {{/htLoading}}
వర్షాల కారణంగా నీళ్లు లోతట్టు ప్రాంతాల్లో నిలిచిపోవడం, రోడ్లపై ట్రాఫిక్ స్తంభించడం, చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయే ప్రమాదం ఉంది. డ్రైనేజీ సమస్యలు, మంచినీటి సరఫరా, విద్యుత్ అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}