వరంగల్‌లోని మామునూరు ఎయిర్‌పోర్ట్ విస్తరణకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను కేంద్రం ఖరారు చేసింది. డీపీఆర్ తుది దశకు చేరుకుంది. ఈ ప్రాజెక్టు కోసం 953 ఎకరాలు అందుబాటులోకి వచ్చింది. జూన్ 2026లో శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టులో 2,500 మీటర్ల రన్‌వే నిర్మాణం ఉంటుంది. ఈ ఎయిర్‌పోర్ట్‌తో ఉత్తర తెలంగాణలో ప్రాంతీయ కనెక్టివిటీ, పైలట్ శిక్షణ కేంద్రంగా మారుతుంది.

వరంగల్ మామునూరు, ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో విమానాశ్రయ ప్రాజెక్టుల అమలును మంత్రులు సమీక్షించారు. గడువుకు అనుగుణంగా పెండింగ్‌లో ఉన్న పరిపాలనా, సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
వరంగల్ ప్రాజెక్ట్ డిజైన్, డీపీఆర్ తుది ఆమోదాల కోసం వేచి ఉంది. విమానాశ్రయంలో పౌర, ప్రత్యేక కార్యకలాపాలను ప్రారంభించడానికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖల మధ్య ఉమ్మడి వినియోగ ఒప్పందం ఖరారు అవుతోంది.
శిక్షణ పొందిన పైలట్ల కొరతను తీర్చడానికి కూడా ఈ ఎయిర్‌పోర్ట్ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం శిక్షణ కార్యకలాపాలు హైదరాబాద్‌లోని శంషాబాద్, బేగంపేట విమానాశ్రయాలు, దుండిగల్ వైమానిక స్థావరంలో జరుగుతున్నాయి. వాణిజ్య ట్రాఫిక్ పెరగడం, ప్రైవేట్ విమానయానంలో పెరుగుదల ఫలితంగా శిక్షణార్థులకు పరిమిత విమాన ప్రయాణాలు ఉంటున్నాయి.
శిక్షణ పొందిన పైలట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతులను పొందడంలో జాప్యాలను ఎదుర్కొంటున్నారు. అందుబాటులో ఉన్న స్లాట్లు తరచుగా తప్పనిసరి విమాన ప్రయాణ గంటలను పూర్తి చేయడానికి సరిపోవడం లేదు. ట్రాఫిక్ స్థాయిలు తక్కువగా ఉండే వరంగల్‌కు శిక్షణ కార్యకలాపాలను మార్చడం వలన షెడ్యూల్ పరిమితులు తగ్గుతాయని భావిస్తున్నారు. శిక్షమకు అనుకూలంగా ఉంటుందని అనుకుంటున్నారు.
ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన వింగ్స్ ఇండియా ఏవియేషన్ సమ్మిట్‌లో సమీప భవిష్యత్తులో భారతదేశానికి దాదాపు 10,000 మంది అదనపు పైలట్లు అవసరమవుతాయని నిపుణులు సూచించారు. మామునూరులో మౌలిక సదుపాయాల అభివృద్ధి, అనుమతులు ఈ డిమాండ్‌లో కొంత భాగాన్ని తీర్చడంలో సహాయపడతాయని అధికారులు తెలిపారు.
{{/usCountry}}ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన వింగ్స్ ఇండియా ఏవియేషన్ సమ్మిట్‌లో సమీప భవిష్యత్తులో భారతదేశానికి దాదాపు 10,000 మంది అదనపు పైలట్లు అవసరమవుతాయని నిపుణులు సూచించారు. మామునూరులో మౌలిక సదుపాయాల అభివృద్ధి, అనుమతులు ఈ డిమాండ్‌లో కొంత భాగాన్ని తీర్చడంలో సహాయపడతాయని అధికారులు తెలిపారు.
{{/usCountry}}హైదరాబాద్‌కు వరంగల్ సమీపంలో ఉండటం వల్ల పైలట్ శిక్షణ ఇచ్చేవారిని తరలించేందుకు సులభతరం అవుతుందని భావిస్తున్నారు. అంతేకాదు హైదరాబాద్‌తో పోలిస్తే వరంగల్‌లో కాస్ట్ ఆఫ్ లీవింగ్ తక్కువ కారణంగా విద్యార్థులకు ఖర్చులను తగ్గించవచ్చు.
తెలంగాణ విమానయాన విస్తరణ ప్రణాళికలకు కేంద్రం మద్దతుగా నిలుస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఆదిలాబాద్, పెద్దపల్లిలోని ప్రాజెక్టులతో పాటు మామునూరు విమానాశ్రయం పునరుద్ధరణ, కార్గో సేవలు, నిర్వహణ, మరమ్మత్తు, ఓవర్‌హాల్ సౌకర్యాలకు మద్దతు ఇస్తుందని అనుకుంటున్నారు. స్థానిక పరిశ్రమలకు, వ్యవసాయానికి లాజిస్టిక్స్ మద్దతును అందిస్తుందని చెబుతున్నారు. ఈ విమానాశ్రయాలు పూర్తైతే.. ఉపాధితోపాటుగా ప్రాంతీయ కనెక్టివిటీ మెరుగుపడనుంది.