...
...
Next Story

తెలంగాణ యువతకు గుడ్‌న్యూస్ - హన్మకొండలో ‘అగ్నివీర్’ రిక్రూట్‌మెంట్ ర్యాలీ, తేదీలివే

ఆర్మీలో చేరాలనుకునే యువతకు ఇండియన్ ఆర్మీ కీలక అప్డేట్ ఇచ్చింది. హన్మకొండలో అగ్నివీర్ రిక్రూట్ మెంట్ ర్యాలీని నిర్వహించనుంది. ఈ నెల 10 నుంచి 22 వరకు ఈ ర్యాలీ ఉంటుందని ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.

Published on: Nov 5, 2025, 05:15:01 IST
Advertisement

నిరుద్యోగ యువతకు ఇండియన్ ఆర్మీ శుభవార్త చెప్పింది. ఆర్మీలో చేరాలనుకునేవారికోసం అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీని నిర్వహించబోతుంది. ఈ ర్యాలీకి రాష్ట్రంలోని 33 జిల్లాల అభ్యర్థులు హాజరుకావొచ్చు. తెలంగాణ ప్రభుత్వ సహకారం, చెన్నై జోన్ రిక్రూటింగ్ ఆఫీస్ ఆధ్వర్యంలో ఈ భారీ ర్యాలీనిని హన్మకొండలోని జవహర్ లాల్ నెహ్రు స్టేడియంలో నిర్వహించనున్నారు.

ఈనెల 10 నుంచే ర్యాలీ ప్రారంభం….

హన్మకొండలో ‘అగ్నివీర్’ రిక్రూట్‌మెంట్ ర్యాలీ
హన్మకొండలో ‘అగ్నివీర్’ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

ఈ నెల 10వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఈ రిక్రూట్ మెంట్ ర్యాలీ ప్రక్రియ ఉంటుందని ఆర్మీ అధికారులు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ఆఫీస్ ఈ ర్యాలీని సమన్వయం చేస్తుంది. ఈ ర్యాలీలో భాగంగా.... అగ్నివీర్ జనరల్ డ్యూటీ , టెక్నికల్, క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్, ట్రేడ్స్‌మెన్ వంటి వివిధ కేటగిరీల కింద అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఈ ఉద్యోగాలకు పదో తరగతి అర్హత ఉన్న వాళ్లు అర్హులవుతారు. సంబంధిత నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది. http://joinindianarmy.nic.in వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసినట్లు రిక్రూట్ మెంట్ బోర్డు తెలిపింది. ఈ అగ్నివీర్ స్కీమ్ కింద యువతకు 4 ఏళ్ల పాటు దేశ సేవ చేసే అవకాశాన్ని ఇస్తుంది. ఎంపికైన అభ్యర్థులు ఆరు నెలల పాటు కఠిన శిక్షణ పొందుతారు. తదుపరి 3.5 సంవత్సరాలు ఆర్మీలో విధులు నిర్వహిస్తారు.

అభ్యర్థులు తమకు జారీ చేసిన అడ్మిట్ కార్డుతో పాటు, అవసరమైన అన్ని ధృవీకరణ పత్రాలను తప్పనిసరిగా వెంట తీసుకురావాల్సి ఉంటుంది. ఏదైనా సందేహాలు లేదా వివరాల కోసం అభ్యర్థులు సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ కార్యాలయాన్ని 040-27740059, 27740205 నంబర్లలో సంప్రదించవచ్చని తాజా ప్రకటనలో వివరించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks