Agniveer Recruitment Rally : హైదరాబాద్‌లో నవంబర్ 13 నుండి 24 వరకు అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ
Agniveer Recruitment Rally : తెలంగాణలోని 33 జిల్లాల నుండి అగ్నివీర్ల కోసం నవంబర్ 13 నుండి 24 వరకు హైదరాబాద్ గచ్చిబౌలిలో రిక్రూట్‌మెంట్ ర్యాలీని జరగనుంది. అర్హులైన అభ్యర్థులు ఇందులో పాల్గొనవచ్చు.
తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు భారత సైన్యం గొప్ప అవకాశం కల్పించింది. 2027 రిక్రూట్‌మెంట్ సంవత్సరానికి గాను అగ్నివీర్ పోస్టుల భర్తీకి సంబంధించి భారీ రిక్రూట్‌మెంట్ ర్యాలీని నిర్వహించనున్నట్లు ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ సికింద్రాబాద్ ప్రకటించింది.
అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ(ఫైల్ ఫోటో)
హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రసిద్ధ జీఎంసీ బాలయోగి అథ్లెటిక్ స్టేడియం వేదికగా నవంబర్ 13 నుంచి నవంబర్ 24 వరకు ఈ ఎంపిక ప్రక్రియ సాగనుంది. తెలంగాణలోని 33 జిల్లాలకు చెందిన అర్హులైన అభ్యర్థులందరూ ఈ ర్యాలీలో పాల్గొనవచ్చు.
{{^htLoading}} {{/htLoading}}
ఈ ర్యాలీ ద్వారా నాలుగు వేర్వేరు విభాగాలలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ ట్రేడ్స్‌మన్ - 10వ తరగతి ఉత్తీర్ణత, అగ్నివీర్ ట్రేడ్స్‌మన్ - 8వ తరగతి ఉత్తీర్ణత పోస్టులు ఉన్నాయి.
అగ్నివీర్ నియామక ర్యాలీకి సంబంధించి ఇప్పటికే ఆన్‌లైన్‌లో అడ్మిట్ కార్డ్ పొందిన అభ్యర్థులు మాత్రమే ఈ ర్యాలీకి హాజరు కావాలి. నియామక నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా తమ విద్యార్హత, కుల, నివాస, ఇతర అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలను తప్పనిసరిగా వెంట తీసుకురావాలి.
కేటాయించిన తేదీల్లో నిర్ణీత సమయానికి మైదానానికి చేరుకుని రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. భారత సైన్యంలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు డిమాండ్ చేసే దళారులు, మధ్యవర్తులు మాటలను నమ్మవద్దని ఆర్మీ అధికారులు యువతను హెచ్చరించారు. ఆర్మీ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ పూర్తిగా డిజిటలైజ్డ్, పారదర్శకమైనది, ప్రతిభాధారితమైనది. ఈ ఎంపిక ప్రక్రియలో ఎలాంటి దళారుల ప్రమేయం లేదా సిఫార్సులకు తావు ఉండదని స్పష్టం చేశారు.
ర్యాలీకి సంబంధించిన మరిన్ని వివరాలు, నిబంధనలు, సమాచారం కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్: www.joinindianarmy.nic.in చూడవచ్చు. ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ (ఏఆర్‌ఓ), సికింద్రాబాద్ కార్యాలయాన్ని 040-27740059 ఫోన్ నంబర్‌లో సంప్రదించి సమాచారం తెలుసుకోవచ్చు. దేశసేవ చేయాలనే ఉత్సాహం ఉన్న తెలంగాణ నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్మీ అధికారులు సూచించారు.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.