IRCTC Shirdi Tour Package : హైదరాబాద్ - షిర్డీ టూర్ ప్యాకేజీ… త్రయంబకేశ్వర్ దర్శనం కూడా! పూర్తి వివరాలు ఇవే!

IRCTC Hyderabad Shirdi Tour Package : హైదరాబాద్ నుంచి షిర్డీకి ఐఆర్సీటీసీ టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఈనెల 6వ తేదీన జర్నీ ఉంటుంది. 

Published on: Nov 1, 2026, 12:28:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

షిర్డీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా…? హైదరాబాద్ నుంచి బడ్జెట్ ధరలోనే టూర్ ప్యాకేజీ వచ్చేసింది. మూడు రోజుల పాటు టూర్ ఉంటుంది. ట్రైన్ జర్నీ ద్వారా ఆపరేట్ చేస్తారు. ఐఆర్సీటీసీ టూరిజం తీసుకువచ్చిన ఈ టూర్(సాయి శివమ్) ప్యాకేజీలో భాగంగా… షిర్డీ సాయిబాబా ఆలయాన్ని దర్శించుకోవచ్చు. మరికొన్ని ప్రదేశాలను కూడా చూడొచ్చు.

షిర్డీ టూర్ ప్యాకేజీ
షిర్డీ టూర్ ప్యాకేజీ

ప్రతీ శుక్రవారం కాచిగూడ నుంచి బయలుదేరే ఈ టూర్ మొత్తం 3 రాత్రులు, 4 రోజుల పాటు కొనసాగుతుంది. https://www.irctctourism.com వెబ్ సైట్ లోకి వెళ్లి టికెట్లను బుకింగ్ చేసుకోవచ్చు.

టూర్ షెడ్యూల్ వివరాలు…

  • మొదటి రోజు : సాయంత్రం 18:30 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి రైలు నెంబర్ 17064 (అజంతా ఎక్స్‌ప్రెస్) బయలుదేరుతుంది. రాత్రంతా రైలు ప్రయాణం ఉంటుంది.
  • రెండో రోజు : ఉదయం 7:10 గంటలకు మహారాష్ట్రలోని నాగర్‌సోల్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడ నుంచి ఐఆర్‌సీటీసీ ఏర్పాటు చేసిన వాహనంలో షిర్డీకి తీసుకెళ్లి హోటల్‌లో దింపుతారు. హోటల్‌లో అల్పాహారం చేసిన తర్వాత…. భక్తులు సొంతంగా షిర్డీ సాయిబాబా ఆలయాన్ని దర్శించుకోవచ్చు. సాయంత్రం వేళ షిర్డీలో ఉచితంగా గడపవచ్చు. రాత్రికి షిర్డీలోనే బస ఉంటుంది.
  • మూడో రోజు : హోటల్‌లో ప్రాతఃకాల అల్పాహారం ముగించుకుని చెక్-అవుట్ అవుతారు. అక్కడ నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రయంబకేశ్వర్‌కు ప్రయాణమై, ప్రసిద్ధ త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయాన్ని దర్శించుకుంటారు. అనంతరం 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాసిక్‌కు చేరుకుని పంచవటిని సందర్శిస్తారు. సాయంత్రం నాసిక్ నుంచి నాగర్‌సోల్ (90 కి.మీ) చేరుకుని, రాత్రి 20:30 గంటలకు నాగర్‌సోల్ స్టేషన్‌లో దింపుతారు. రాత్రి 21:20 గంటలకు రైలు నెంబర్ 17063 (అజంతా ఎక్స్‌ప్రెస్) ఎక్కి తిరుగు ప్రయాణమవుతారు. (గమనిక: పంచవటి ప్రాంతంలోకి పెద్ద వాహనాలకు అనుమతి ఉండకపోవచ్చు, భక్తులు సొంత ఖర్చులతో ఆటోరిక్షా వంటి స్థానిక రవాణాను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది).
  • నాలోగో రోజు : ఉదయం 09:45 గంటలకు రైలు కాచేగూడ స్టేషన్‌కు చేరుకోవడంతో ప్యాకేజీ పూర్తవుతుంది.

టూర్ ప్యాకేజీ ధరలు :

ఈ ప్యాకేజీ ధరలు చూస్తే…. సింగిల్ షేరింగ్ కు రూ.11560గా ఉంది. డబుల్ షేరింగ్ కు రూ. 9430,ట్రిపుల్ షేరింగ్ కు రూ. 9240గా ఉంది. కంఫర్ట్ క్లాస్ లో ఈ ధరలు అందుబాటులో ఉన్నాయి. స్టాండర్డ్ క్లాస్ లో చూస్తే ట్రిపుల్ షేరింగ్ కు రూ. 9870, డబుల్ షేరింగ్ కు రూ. 7740, సింగిల్ షేరింగ్ కు రూ. 7550గా నిర్ణయించారు.

బుకింగ్ కోసం ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ irctctourism.com ని సందర్శించవచ్చు లేదా సికింద్రాబాద్‌లోని ఐఆర్‌సీటీసీ కార్యాలయం (ఫోన్: 04027702407, 9701360701) ను సంప్రదించవచ్చు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More