...
...
Next Story

ప్రతి పేదవాడికి సొంతింటి కల నిజం.. వందకు వంద శాతం ఇందిరమ్మ ఇండ్లు.. మంత్రి పొంగులేటి కీలక హామీ

ఇందిరమ్మ ఇండ్ల విషయంలో తగ్గేది లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. పేదలందరికీ ఇళ్లను తప్పనిసరిగా అందిస్తామని చెప్పారు.

Published on: Feb 9, 2026, 10:02:51 IST
Advertisement

భూపాలపల్లి జిల్లా చెల్పూర్‌లో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతిబాట బహిరంగ సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు. పేదల సంక్షేమం, భద్రత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. పట్టణాలు, గ్రామాల్లోని ప్రతి అర్హత కలిగిన పేదవాడికి సొంత ఇల్లు అనే కలను నెరవేర్చే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

'వందకు వంద శాతం పట్టణాలు, గ్రామాల్లోని అర్హులైన ప్రతి పేదవారికి సొంతింటి కలను నెరవేర్చే బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం తన భుజాలపైకి ఎత్తుకుంది.' అని మంత్రి పొంగులేటి అన్నారు.

రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళు, సన్న బియ్యం, రేషన్ కార్డులు, ఉచిత విద్యుత్ వంటి అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చిందని పొంగులేటి చెప్పారు. ఇందిరమ్మ చీరలు ధరించి సమావేశానికి వచ్చిన మహిళల ముఖాల్లో ఆనందాన్ని గమనించానని చెప్పారు.

రెండో దశలో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ ఏప్రిల్ నుండి ప్రారంభమవుతుందని మంత్రి ప్రకటించారు. మరో మూడు దశల్లో అర్హులైన పేదలకు సొంత ఇళ్లను ఇస్తామని ప్రకటించారు. ఇందిరమ్మ గృహ పథకంపై ఎటువంటి రాజీ పడబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారని తెలిపారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమ 10 సంవత్సరాల పాలనలో పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఇళ్ల నిర్మాణాన్ని విస్మరించిందని శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోపు మొదటి దశలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను అందించామని వెల్లడించారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe