ఇందిరమ్మ టవర్స్‌ ఫ్లాట్ల స్కీమ్ అప్డేట్ - రూ. 1 లక్ష చెల్లింపు గడువు పొడిగింపు! లేకపోతే…..

క్యూర్‌ పరిధిలోని 16 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్స్ ఫ్లాట్లు పొందిన లబ్ధిదారులకు ప్రభుత్వం ఊరటనిచ్చింది. మొదటి విడత రూ. లక్ష చెల్లించే గడువును ఈ నెల 9 వరకు పొడిగించింది.

Published on: Oct 5, 2026, 10:47:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

క్యూర్‌ (హైదరాబాద్) పరిధిలోని 16 నియోజకవర్గాల్లో నిర్మిస్తున్న ఇందిరమ్మ టవర్స్‌ ఫ్లాట్లకు ఎంపికైన లబ్ధిదారులకు రాష్ట్ర హౌసింగ్‌ బోర్డు కీలక అప్డేట్ ఇచ్చింది. ఇందిరమ్మ టవర్స్ నివాసాల కోసం ఎంపిక చేసిన అర్హులకు ఇప్పటికే ప్రొవిజినల్‌‌ కేటాయింపు పత్రాలను (అలాట్‌మెంట్ లెటర్లు) అందజేసినట్లు గుర్తు చేసింది. అయితే ఈ ఇళ్ల కేటాయింపు ప్రక్రియను మరింత వేగవంతం చేయడంతో పాటు లబ్ధిదారులకు ఊరటనిచ్చేందుకు వీలుగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.

ఇందిరమ్మ టవర్స్
ఇందిరమ్మ టవర్స్

గడువు పొడిగింపు…

ఈ ఫ్లాట్లు పొందిన లబ్ధిదారులు మొదటి విడత వాటా కింద చెల్లించే రూ. లక్ష గడువు హౌసింగ్ బోర్డు గడువును పొడిగించింది. లబ్ధిదారులు తమ మొదటి విడత వాటా సొమ్మును ఈ నెల 9వ తేదీలోపు ఖచ్చితంగా చెల్లించాలని స్పష్టం చేసింది.

ఇప్పటివరకు జరిగిన ఇళ్ల కేటాయింపుల వివరాలను పరిశీలిస్తే….. హౌసింగ్ బోర్డు అధికారులు మొత్తం 5,501 ప్రొవిజినల్‌ కేటాయింపు పత్రాలను జారీ చేశారు. అయితే వీటిలో ఇప్పటివరకు 3,271 మంది లబ్ధిదారులు మాత్రమే తమ మొదటి విడత వాటా కింద రూ. లక్ష చొప్పున చెల్లించారు. ఇంకా మిగిలిన లబ్ధిదారులు తమ చెల్లింపులను పూర్తి చేయాల్సి ఉంది. అందుకోసమే లబ్ధిదారుల విజ్ఞప్తి మేరకు ఈ నెల 9వ తేదీ వరకు ఆఖరి అవకాశంగా గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

చెల్లించకపోతే కేటాయింపు రద్దు…

గడువు విషయంలో అధికారులు ముఖ్యమైన హెచ్చరికలు జారీ చేశారు. నిర్ణీత సమయం అంటే ఈ నెల 9వ తేదీ లోగా మొదటి విడత సొమ్మును చెల్లించని లబ్ధిదారుల ప్రొవిజినల్‌ కేటాయింపు పత్రాలను ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండానే తక్షణమే రద్దు చేస్తామని హౌసింగ్‌ బోర్డు స్పష్టం చేసింది. ఒకవేళ నిర్ణీత గడువు దాటిన తర్వాత చెల్లింపులు చేయకపోవడం వల్ల రద్దయిన ఫ్లాట్లను, ఇప్పటికే వెయిటింగ్‌ జాబితాలో ఉన్న ఇతర అర్హులైన అభ్యర్థులకు వరుస క్రమంలో కేటాయిస్తామని బోర్డు తేల్చిచెప్పింది. కాబట్టి ఎంపికైన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని త్వరితగతిన చెల్లింపులు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More