లోగో డిజైన్ చేయండి.. రూ. 1 లక్ష గెలుచుకోండి.. తెలంగాణ హౌసింగ్ బోర్డు బంపర్ ఆఫర్!

తెలంగాణ హౌసింగ్ బోర్డ్ ఎల్‌ఐజీ గృహ నిర్మాణ పథకం కోసం లోగో డిజైన్ పోటీని ప్రకటించింది. గెలిచిన వారికి రూ.1 లక్ష నగదు బహుమతి అందుతుంది. జులై 12లోగా ఇన్‌స్టాగ్రామ్ లింక్ ద్వారా అప్లై చేసుకోవాలి.

Published on: Jul 8, 2026, 20:47:28 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మీలోని క్రియేటివిటీకి పదును పెట్టండి. తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక గృహ నిర్మాణ పథకానికి అధికారిక లోగోను అందించే అద్భుతమైన అవకాశం మీకు వచ్చింది. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్(CURE) పరిధిలో నిర్మించబోయే లక్ష ఎల్‌ఐజీ గృహ నిర్మాణ పథకం కోసం తెలంగాణ హౌసింగ్ బోర్డు ఒక లోగో డిజైన్ పోటీ ప్రకటించింది. ఉత్తమ లోగోను రూపొందించిన విజేతకు అక్షరాలా రూ. 1,00,000 నగదు బహుమతిగా అందించనున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వి.పి. గౌతమ్ వెల్లడించారు.

తెలంగాణ హౌసింగ్ బోర్డు కోసం లోగో డిజైన్ చేయండి
తెలంగాణ హౌసింగ్ బోర్డు కోసం లోగో డిజైన్ చేయండి

ఈ డిజైన్ పోటీలో పాల్గొనడానికి కొన్ని విషయాలు డిజైనర్లు గుర్తుంచుకోవాలి. ముందుగా తెలంగాణ హౌసింగ్ బోర్డు అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌ను (https://www.instagram.com/p/Dahnht3zFwE/) ఓపెన్ చేయాలి.

సదరు ఇన్‌స్టాగ్రామ్ బయో (Bio) లో అందుబాటులో ఉన్న గూగుల్ ఫామ్ లింక్‌పై క్లిక్ చేయాలి.

ఫామ్‌లో మీ వ్యక్తిగత వివరాలను పూర్తి చేసి, మీరు తయారు చేసిన లోగో డిజైన్‌ను అక్కడ అప్‌లోడ్ చేయాలంతే. ఆ తర్వాత లోగోలోను పరిశీలించి.. మీ లోగో డిజైన్ నచ్చి.. ఫైనల్ చేస్తే మీరు లక్ష రూపాయలు గెలుచుకోవచ్చు.

మీరు డిజైన్ చేసే లోగో కేవలం ఒక బొమ్మలా కాకుండా.. పేద, దిగువ ఆదాయ వర్గాల ప్రజల సొంతింటి కలలను ప్రతిబింబించేలా ఉంటే మంచిది. ముఖ్యంగా నమ్మకం, ఆశ, పురోగతి, అందరికీ అందుబాటులో ఉండే సరసమైన గృహ నిర్మాణాన్ని సూచించే థీమ్‌తో డిజైన్ చేస్తే బెటర్.

ఈ లోగో డిజైన్ల సమర్పణకు 2026, జూలై 12ను ఆఖరి తేదీగా పెట్టారు. ఆసక్తి ఉన్న క్రియేటర్లు, గ్రాఫిక్ డిజైనర్లు ఈ గడువు లోపు తమ ఎంట్రీలను పంపించాలి.

ఇటీవల ఈ గృహ నిర్మాణ పథకానికి తగిన పేరును సూచించాల్సిందిగా హౌసింగ్ బోర్డు నిర్వహించిన పోటీకి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించిందని వి.పి. గౌతమ్ తెలిపారు. దాదాపు 14 వేల మంది ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొని పేర్లను సూచించారు. అతి త్వరలోనే ఈ పథకం అధికారిక పేరును, అలాగే విజేత వివరాలను ప్రకటించనున్నారు. ఈ భారీ గృహ నిర్మాణ పథకం ప్రారంభోత్సవ వేడుకలోనే విజేతలకు బహుమతులను అందజేస్తామని స్పష్టం చేశారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More