అదిరిపోయే లుక్స్‌తో Tata Sierra EV అఫీషియల్ డిజైన్ రివీల్- ధర, ఫీచర్లు ఇవే..
Tata Sierra EV launch date : భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తన మోస్ట్ అవేటెడ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ‘సియెర్రా ఈవీ’ బాహ్య డిజైన్‌ను అధికారికంగా వెల్లడించింది. జూన్ 30న గ్రాండ్‌గా లాంచ్ కాబోతున్న ఈ కారు అంచనా ధరలు, బ్యాటరీ ప్యాక్, రేంజ్ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాము..
టాటా మోటార్స్ తన ఐకానిక్ బ్రాండ్‌ను ఎలక్ట్రిక్ అవతార్‌లో తిరిగి తీసుకురావడానికి సర్వం సిద్ధం చేసింది. దేశీయ ఆటోమొబైల్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'టాటా సియెర్రా ఈవీ' జూన్ 30న మార్కెట్లోకి అధికారికంగా విడుదల కానుంది. అయితే, ఈ లాంచ్‌కు ముందే కంపెనీ ఈ సరికొత్త ఎలక్ట్రిక్ మిడ్‌సైజ్ ఎస్‌యూవీ పూర్తి ఎక్స్‌టీరియర్ డిజైన్‌ను అధికారికంగా ఆవిష్కరించింది!

టాటా తన పాత ఐసీఈ (ఇంజన్) మోడళ్ల నుంచి ఈవీగా మార్చే పద్ధతినే దీనికి కూడా అప్లై చేసింది. రెగ్యులర్ సియెర్రా మోడల్‌తో పోలిస్తే దీని బాడీ స్ట్రక్చర్‌లో పెద్దగా మార్పులు లేనప్పటికీ.. కలర్ కాంబినేషన్స్, ఫ్రంట్ ఫేసియాలో కొన్ని కీలకమైన ఎలక్ట్రిక్ మార్పులు చేసింది.
టాటా సియెర్రా ఈవీ డిజైన్ ఎలా ఉంది?
సియెర్రా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ముందు భాగంలో ఐసీఈ మోడల్‌లో ఉండే నల్లటి ఫంక్షనల్ గ్రిల్ స్థానంలో.. ఈవీ వెర్షన్‌లో బాడీ-కలర్ ‘బ్లాంక్డ్-ఆఫ్ గ్రిల్’ని అందించారు. ఎల్ఈడీ లైట్ బార్ కింద ఉండే 'Sierra' బ్రాండింగ్‌ను ఈవీలో తొలగించారు. బంపర్ కింది భాగంలో గ్లోస్-బ్లాక్ ఫినిషింగ్, సిల్వర్ స్కిడ్ ప్లేట్ ఉన్నాయి.
కారు పక్క భాగం, వెనుక డిజైన్ దాదాపు ఒకేలా ఉన్నప్పటికీ.. ఐడెంటిటీ కోసం ఫ్రంట్ డోర్లపై, టెయిల్‌గేట్‌పై ప్రత్యేకంగా ‘Sierra.ev’ బ్యాడ్జ్‌లను ఇచ్చారు. ఇందులో 19-ఇంచుల భారీ అలాయ్ వీల్స్ కొనసాగనున్నాయి. అలాగే సరికొత్త సిల్వర్ షేడ్ కలర్ ఆప్షన్‌ను ఈ కారులో పరిచయం చేయనున్నారు.
క్యాబిన్ లోపల ట్రిపుల్ స్క్రీన్ మ్యాజిక్!
టాటా మోటార్స్ ఇంకా ఈ టాటా సియెర్రా ఈవీ ఇంటీరియర్ వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. అయినప్పటికీ, లీకైన సమాచారం ప్రకారం ఈ కారు టాప్ వేరియంట్లలో ఏకంగా మూడు స్క్రీన్ల సెటప్ రానుంది.
- 10.25-ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
- 12.3-ఇంచ్ సెంట్రల్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్
- 12.3-ఇంచ్ ప్యాసింజర్ డిస్‌ప్లే స్క్రీన్
ఇక బేస్ వేరియంట్లలో డ్యూయల్ స్క్రీన్ సెటప్‌తో పాటు హెడ్-అప్ డిస్‌ప్లే లభించనుంది. ఇవి కాకుండా పనోరమిక్ సన్‌రూఫ్, పవర్డ్ అండ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ప్రీమియం ఆడియో సిస్టమ్, మల్టిపుల్ డ్రైవ్ మోడ్స్ వంటి లగ్జరీ ఫీచర్లు ఇందులో ఉండబోతున్నాయి.
పవర్‌ఫుల్ బ్యాటరీ ప్యాక్.. 600 కిమీ పైగా రేంజ్!
మెకానికల్ పరంగా చూస్తే, ఈ టాటా సియెర్రా ఈవీ రాబోయే ‘హారియర్ ఈవీ’ సాంకేతికతను పంచుకోనుంది. ఇది టాటా అధునాతన 'acti.ev+' ఆర్కిటెక్చర్ ప్లాట్‌ఫారమ్‌పై రూపొందుతోంది.
బ్యాటరీ ఆప్షన్లు: ఇందులో 65కేడబ్ల్యూహెచ్, 75కేడబ్ల్యూహెచ్ సామర్థ్యం గల రెండు బ్యాటరీ ఆప్షన్లు లభించనున్నాయి.
ఆల్-వీల్ డ్రైవ్ (ఏడబ్ల్యూడీ): టాప్-స్పెక్ వేరియంట్లలో ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను అందించనున్నట్లు టాటా ఇటీవల ధృవీకరించింది. బేస్ వేరియంట్లు రియర్-వీల్ డ్రైవ్ (ఆర్డబ్ల్యూడీ) కాన్ఫిగరేషన్‌తో వస్తాయి.
మైలేజ్/రేంజ్: హారియర్ ఈవీ గరిష్టంగా 627 కిమీ రేంజ్ ఆఫర్ చేస్తుండగా.. సియెర్రా ఈవీ దానికంటే పరిమాణంలో చిన్నదిగా, బరువు తక్కువగా ఉండటం వల్ల దీని రేంజ్ అంతకంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
ధర, పోటీదారులు..
టాటా ఈవీ పోర్ట్‌ఫోలియోలో ఈ సియెర్రా ఈవీ ‘కర్వ్ ఈవీ’, 'హారియర్ ఈవీ'ల మధ్య స్లాట్ కానుంది. దీని ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 18 లక్షల నుంచి రూ. 25 లక్షల బడ్జెట్ పరిధిలో ఉండే అవకాశం ఉంది. ఇది మార్కెట్లోకి వచ్చాక మహీంద్రా బీఈ 6, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, ఎంజీ జెడ్ఎస్ ఈవీ, మారుతీ సుజుకీ ఈ విటారాలకు గట్టి పోటీని ఇవ్వనుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


