...
...
Next Story

కేటీఆర్‌పై సీపీకి ఇందుజా బల్మూరి ఫిర్యాదు.. మార్ఫింగ్ ఫొటోలపై ఆగ్రహం

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆయన మద్దతుదారులైన సోషల్ మీడియా హ్యాండిల్స్‌పై కాంగ్రెస్ నేత ఇందుజా బల్మూరి హైదరాబాద్ సీపీకి ఫిర్యాదు చేశారు. తన వివాహంపై మార్ఫింగ్ ఫొటోలతో దుష్ప్రచారం చేస్తూ, కుల వివక్షతో వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు.

Published on: Oct 29, 2026, 06:43:31 IST
Advertisement

హైదరాబాద్: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు ఆయన మద్దతుతో నడుస్తున్న సోషల్ మీడియా హ్యాండిల్స్‌పై కాంగ్రెస్ నాయకురాలు, ఇండియన్ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇందుజా బల్మూరి హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. మార్ఫింగ్ ఫొటోలను సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తూ, తన వివాహ బంధాన్ని లక్ష్యంగా చేసుకుని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు.

గోవా ప్రి-వెడ్డింగ్ ఫొటోల దుర్వినియోగం

కేటీఆర్‌పై సీపీకి ఇందుజా బల్మూరి ఫిర్యాదు.. మార్ఫింగ్ ఫొటోలపై ఆగ్రహం
కేటీఆర్‌పై సీపీకి ఇందుజా బల్మూరి ఫిర్యాదు.. మార్ఫింగ్ ఫొటోలపై ఆగ్రహం

ఇందుజా బల్మూరి కాంగ్రెస్ ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ సతీమణి. ఆరు నెలల క్రితం వీరి వివాహం జరిగింది. కాగా, తమ ఫొటోలను సోషల్ మీడియాలో తప్పుగా చిత్రీకరిస్తున్నారని ఇందుజ ఆవేదన వ్యక్తం చేశారు.

"గోవాలో మేం తీసుకున్న ప్రి-వెడ్డింగ్ షూట్ ఫొటోలను వికృతంగా మార్చేశారు. నా భర్తకు వేరే మహిళలతో సంబంధాలు ఉన్నాయంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. అసలు ఆ ఫొటోల్లో ఉన్నది నేను. కానీ, కక్షపూరితంగా నా వ్యక్తిత్వాన్ని, మా వివాహాన్ని అపహాస్యం చేసేలా పోస్టులు పెడుతున్నారు" అని ఇందుజా వార్తా సంస్థ 'ఏఎన్ఐ' (ANI)తో స్పష్టం చేశారు.

కుల వివక్షే కారణమంటూ తీవ్ర ఆరోపణలు

సోషల్ మీడియా వేధింపుల వెనుక కుల వివక్ష దాగి ఉందంటూ ఇందుజా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తమ పెళ్లి జరిగి ఆరు నెలలు అవుతున్నా సోషల్ మీడియాలో ట్రోలింగ్, అవమానాలు కొనసాగుతున్నాయని చెప్పారు.

"మా పెళ్లి అంటే కేటీఆర్‌కు అసహనం. దళితులంటే, ఎస్సీలంటే ఆయనకు పడదు. ఒకే వర్గానికి (వెలమ) మాత్రమే ఆయన ప్రాధాన్యం ఇస్తారు" అని ఆమె ఆరోపించారు.

వేధింపులపై గళం విప్పాలని పిలుపు

తమ వ్యక్తిగత విషయాలను, పాత ఫొటోలను బయటకు లాగి సోషల్ మీడియా వేదికగా భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఇందుజా పేర్కొన్నారు. పెళ్లి అనేది జీవితంలో ఎంతో సంతోషకరమైన ఘట్టమని, అయితే కులాల వ్యత్యాసం కారణంగా తాను అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తోందని వాపోయారు.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks