రెవెన్యూ, సర్వే, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ఎన్ఐసీ అధికారులతో భూభారతి పోర్టల్ తుది దశకు చేరుకున్నందున సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా గత ప్రభుత్వ హయాంలో ధరణి తెచ్చిన చిక్కుముడులను విప్పుతూ, రైతులకు అత్యంత పారదర్శకంగా, సులభతరమైన సేవలు అందించడమే లక్ష్యంగా భూభారతి పోర్టల్‌ని రూపొందించామన్నారు.

నారాయణపేట జిల్లా కొస్గి, రంగారెడ్డి జిల్లా అమన్‌గల్, సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి, ఖమ్మం జిల్లా కూసుమంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలాల్లో ఏప్రిల్ 2 నుంచి ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ సేవలు ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని మంత్రి పొంగులేటి చెప్పారు.
పైలట్ మండలాల్లో మెరిట్-డీమెరిట్‌లను క్షుణ్ణంగా పరిశీలించి వాటికి అవసరమైన మార్పులు చేర్పులు చేసి రెండో దశలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అమలు చేస్తామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ , సర్వే విభాగాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ ప్రతి భూలావాదేవీ వివరాలు పారదర్శకంగా కనిపించేలా ఈ పోర్టల్‌ను రూపొందించినట్టుగా మంత్రి పొంగులేటి వివరించారు.
'పోర్టల్‌లో ప్రధానంగా సమాచార సేవలు, సర్వే సేవలు, కరెక్షన్ సేవలు, అప్పీల్ సేవలు, రిజిస్ట్రేషన్ సేవలతోపాటు సిటిజన్ డాష్ బోర్డు సేవలకు సంబంధించి మైల్యాండ్ పోర్ట్‌ఫోలియో, నాలా ఆర్డర్స్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ వివరాలు, ఫీడ్‌బ్యాక్, సంబంధిత అధికారుల వివరాలు, ఆర్వోఆర్, భూధార్ నెంబర్, దరఖాస్తు వివరాలు, మ్యూటేషన్, ఈసీ, మార్కెట్ విలువ, విలేజ్ మ్యాప్, ప్రతి సర్వేనెంబర్‌కు మ్యాప్, గ్రామాల నక్షా, పాస్ బుక్ కరెక్షన్ వంటి పూర్తి సమాచారం, సేవలు లభించేలా మూడు విభాగాలను అనుసంధానం చేస్తూ భూభారతి పోర్టల్ సకల సమాచారంతో సేవలందిస్తుంది.' అని మంత్రి పొంగులేటి చెప్పారు.
రైతులు ఆధార్ నెంబరుతో అనుసంధానమైన మొబైల్ నెంబర్ ద్వారా భూభారతి పోర్టల్‌లో లాగిన్ అయ్యి భూములకు సంబంధించిన వివరాలను పొందవచ్చని పొంగులేటి పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్, ఇతర భూసేవల కోసం దరఖాస్తు చేసుకున్న మొదలు ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రతి స్థాయిలో వివరాలను తెలియజేస్తూ ఎస్ఎంఎస్ ద్వారా ఖాతాదారునికి సమాచారం అందుతుందన్నారు. ధరణి పోర్టల్‌లో 36 మాడ్యూల్స్ ఉండగా భూభారతి పోర్టల్‌లో ఒకే ఛాప్టర్ కింద తీసుకువచ్చామన్నారు.
{{/usCountry}}రైతులు ఆధార్ నెంబరుతో అనుసంధానమైన మొబైల్ నెంబర్ ద్వారా భూభారతి పోర్టల్‌లో లాగిన్ అయ్యి భూములకు సంబంధించిన వివరాలను పొందవచ్చని పొంగులేటి పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్, ఇతర భూసేవల కోసం దరఖాస్తు చేసుకున్న మొదలు ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రతి స్థాయిలో వివరాలను తెలియజేస్తూ ఎస్ఎంఎస్ ద్వారా ఖాతాదారునికి సమాచారం అందుతుందన్నారు. ధరణి పోర్టల్‌లో 36 మాడ్యూల్స్ ఉండగా భూభారతి పోర్టల్‌లో ఒకే ఛాప్టర్ కింద తీసుకువచ్చామన్నారు.
{{/usCountry}}