TG Indiramma Housing Scheme : ఏప్రిల్ 1 నుంచి రెండో దశ ఇందిరమ్మ ఇండ్లు - మంత్రి పొంగులేటి ప్రకటన

Telangana Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల రెండో దశపై కీలక అప్డేట్ వచ్చేసింది. ఏప్రిల్ 1 నుంచి 2వ దశ ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ మేరకు రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి ప్రకటన చేశారు.

Published on: Mar 7, 2026, 19:53:22 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏప్రిల్ 1 నుంచి రెండోదశ ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కార్యక్రమం కానుంది. ఈ మేరకు రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటన చేశారు. మొదటి దశలో రాష్ట్రమంతటా గ్రౌండింగ్ కాని (20 శాతం) లబ్ధిదారులతో మాట్లాడాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ఇందిరమ్మ కమిటీల సూచనల మేరకు మార్చి 31 నాటికి లక్ష ఇండ్ల గృహ ప్రవేశాలు జరిగేలా చూడాలని స్పష్టం చేశారు.

ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్
ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్

ఈరోజు డా.బీ ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ప్ర‌జాపాల‌న‌- ప్ర‌గ‌తి ప్రణాళిక లో భాగంగా హౌసింగ్ శాఖ 99 రోజుల్లో చేప‌ట్ట‌వ‌ల‌సిన కార్యాచ‌ర‌ణ‌పై జిల్లా హౌసింగ్ పీడీల‌తో వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి పొంగులేటి మాట్లాడారు. ప్ర‌జాప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ఇందిర‌మ్మ ఇండ్ల పథకం అమ‌లు చేస్తోందన్నారు. ఈ ప‌థకం రాష్ట్ర చరిత్రలో ఒక బెంచ్ మార్క్‌గా నిల‌వ‌బోతోందని వ్యాఖ్యానించారు.

బ్రిక్ యూనిట్లు ఏర్పాటు చేయండి - మంత్రి పొంగులేటి

ఇందిరమ్మ ఇండ్ల కోసం ఉచిత ఇసుక సరఫరా చేస్తోంది. లబ్ధిదారులకు ఇసుక లభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. మహిళా సంఘాల ఆధ్వర్యంలో బ్రిక్ యూనిట్లు, ప్రతి మండలంలో ఒకటి లేదా రెండు యూనిట్లు ఏర్పాటు చేయాలి. నిర్మాణ సామాగ్రి ధరల భారం లబ్ధిదారులపై పడకుండా జిల్లా స్థాయిలో ధరల నియంత్రణ కమిటీలు చురుగ్గా పని చేయాలి” అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు.

ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాక ఒకటి లేదా రెండు విడతల్లో చెల్లింపులు జరిగిన తరువాత… వివిధ కారణాలతో చెల్లింపులు ఆగిపోతే వెంటనే క్లియర్ చేయాలని మంత్రి ఆదేశించారు. తక్షణమే క్లియర్ చేయకపోతే అధికారులపై చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. రెండో దశలో ఇటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు.

ఏ సంక్షేమ పథకం విజయవంతం కావాలంటే ముఖ్యమంత్రి, మంత్రి, కార్యదర్శి మాత్రమే ప్రయత్నించడం సరిపోదని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించారు. సంబంధిత శాఖలోని ప్రతి అధికారి ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా పని చేసినప్పుడే కార్యక్రమాలు విజయవంతం అవుతాయని అభిప్రాయపడ్డారు. ప్రజల జీవితాల్లో శాశ్వత మార్పు తీసుకురావడానికి అధికారులంతా అంకితభావంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More