Ippa Puvvu Chai Mulugu : మహిళా సంఘాల సరికొత్త ప్రయోగం - ములుగులో ఇక గుమగుమలాడే ‘ఇప్ప పువ్వు టీ’!
ములుగు జిల్లా తాడ్వాయి మండలం కొండపర్తిలో మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన 'ఇప్ప పువ్వు టీ స్టాల్' ప్రారంభమైంది. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ వినూత్న 'ఇప్ప పువ్వు టీ' విశేషాలు ఇక్కడ తెలుసుకోండి….
అడవి తల్లి ఒడిలో దొరికే ప్రకృతి ప్రసాదం ‘ఇప్ప పువ్వు’…! ఇప్పటివరకు మనం ఇప్ప పువ్వుతో తయారు చేసిన లడ్డూలు, ఇతర సంప్రదాయ పిండి వంటల రుచులను మాత్రమే ఆస్వాదించి ఉంటాం. కానీ, ఇప్పుడు ఆ అటవీ ఉత్పత్తులకు సరికొత్త మెరుగులు దిద్దుతూ… ములుగు జిల్లాకు చెందిన ఆడబిడ్డలు ఒక వినూత్నమైన ఆలోచనతో ముందుకు వచ్చారు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే 'ఇప్ప పువ్వు టీ' ని అందుబాటులోకి తెచ్చి పర్యాటకులకు సరికొత్త ఆతిథ్యాన్ని అందిస్తున్నారు.

ములుగు జిల్లా తాడ్వాయి మండలం పరిధిలోని కొండపర్తి గ్రామంలో మహిళా స్వయం సహాయక సంఘాలు (మహిళా గ్రూపులు) ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 'ఇప్ప పువ్వు టీ స్టాల్'ను మంత్రి సీతక్క శుక్రవారం ప్రారంభించారు. స్థానిక గిరిజన మహిళలు స్వయంగా సేకరించిన ఇప్ప పువ్వులతో ఈ ప్రత్యేకమైన టీని తయారు చేసి విక్రయిస్తున్నారు.
ప్రాకృతిక రుచులకు, పర్యాటక రంగానికి నిలయమైన ములుగు జిల్లాకు ప్రతిరోజు వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు. మేడారం సమక్క-సారలమ్మ దర్శనానికి వచ్చేవారైనా…. ఏటూరునాగారం అభయారణ్యం మరియు పరిసర అటవీ ప్రాంతాలను చూడటానికి వచ్చే పర్యాటకులైనా ఈ కొండపర్తి వద్ద ఆగి ఈ ఇప్ప పువ్వు టీని తప్పక రుచి చూడాలని నిర్వాహకులు కోరుతున్నారు.
వ్యాపారవేత్తలుగా ఎదగాలి - మంత్రి సీతక్క
"ములుగు జిల్లాను సందర్శించే ప్రతి ఒక్క పర్యాటకుడు కనీసం ఒక్కసారైనా ఈ ఇప్ప పువ్వు టీని రుచి చూడాలి. ఇది మీ పర్యటనలో ఒక తీపి జ్ఞాపకంగా, మర్చిపోలేని అనుభూతిగా నిలిచిపోతుంది" అని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
మహిళా స్వయం సహాయక సంఘాలు స్థానికంగా అందుబాటులో ఉన్న వనరులతో వినూత్న ఉత్పత్తులను తయారు చేసి వ్యాపారవేత్తలుగా ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు. ఇప్ప పువ్వు టీకి ప్రజల్లో ఆదరణ పెరిగేలా తానే ప్రచారం చేస్తానని, మహిళా సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
సాధారణంగా గిరిజన ప్రాంతాల్లో లభించే ఇప్ప పువ్వులో అనేక రకాల ఔషధ గుణాలు, పోషకాలు నిండి ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు శరీరానికి ఎంతో ఉపశమనాన్ని ఇచ్చే ఈ టీ…. ఆరోగ్య స్పృహ ఉన్న నేటి తరం ప్రయాణికులను విశేషంగా ఆకట్టుకుంటోంది. గిరిజన మహిళల ఆర్థిక స్వావలంబనకు, ఉపాధి అవకాశాల మెరుగుదలకు ఈ టీ స్టాల్స్ ఎంతగానో దోహదపడనున్నాయి. ఇకపై ములుగు వైపు పయనించే పర్యాటకులు ఈ వినూత్న అటవీ ఆతిథ్యాన్ని ఆస్వాదించడానికి ఆసక్తి చూపొచ్చు..!
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

