అలా సరదాగా అండమాన్ వెళ్లొద్దామా? హైదరాబాద్ నుంచి ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ!

అండమాన్ వెళ్లాలనుకుంటున్నారా? అయితే మీకోసం ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. ఆరు రోజులు, ఐదు రాత్రుల టూర్ ప్లాన్ ఇది.

Published on: Jan 28, 2026, 13:15:25 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మరికొన్ని రోజుల్లో ఎక్కిడికైనా టూర్ ప్లాన్ చేస్తున్నారా? కొంతకాలం బిజీ లైఫ్ నుంచి బ్రేక్ తీసకోవాలనుకంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం.. ఐఆర్‌సీటీసీ అందించే అమేజింగ్ టూర్ ప్యాకేజీల గురించి తెలుసుకోండి. ఐఆర్‌సీటీసీ సూపర్ డూపర్ ప్యాకేజీలోని అందిస్తోంది. అందులో భాగంగా హైదరాబాద్ నుంచి అండమాన్‌కు టూర్ ఆపరేట్ చేస్తోంది. అమేజింగ్ అండమాన్ టూర్ పేరుతో మార్చి 30వ తేదీన అందుబాటులో ఉంది. ఇందులో అనేక ప్రాంతాలను చూసి రావొచ్చు. ఫ్లైట్‌లో వెళ్తారు. ఆరు రోజులు, ఐదు రాత్రులు వెళ్లి రావొచ్చు. పోర్ట్ బ్లెయిర్(శ్రీవిజయపురం), హవ్‌లాక్, నెయిలీ చుట్టేసి రావొచ్చు.

ఐఆర్‌సీటీసీ అండమాన్ టూర్
ఐఆర్‌సీటీసీ అండమాన్ టూర్

డే 1

ఉదయం 06:25కి హైదరాబాద్ విమానాశ్రయం నుండి ఫ్లైట్ ఉంటుంది. పోర్ట్ బ్లెయిర్(శ్రీవిజయపురం) విమానాశ్రయానికి ఉదయం 08:55కి చేరుకుంటారు. హోటల్‌కు చెక్ ఇన్ అవుతారు. భోజనం చేస్తారు. సెల్యులార్ జైలు, మ్యూజియం సందర్శిస్తారు. ఆ తర్వాత కార్బిన్స్ కోవ్ బీచ్‌ను సందర్శించండి. తరువాత లైట్ అండ్ సౌండ్ షో కోసం సెల్యులార్ జైలుకు వెళ్తారు. పోర్ట్ బ్లెయిర్‌లో డిన్నర్, రాత్రి బస చేస్తారు.

డే 2

శ్రీ విజయ పురం నుండి స్వరాజ్ ద్వీప్ (హావ్‌లాక్) వరకు క్రూయిజ్ సమయాల ప్రకారం వెళ్తారు. హోటల్‌లో చెక్ ఇన్ చేస్తారు. భోజనం చేస్తారు. రాధానగర్ బీచ్‌ను సందర్శిస్తారు. హావ్‌లాక్ ద్వీపంలో డిన్నర్, రాత్రి బస ఉంటుంది.

డే 3

హావ్‌లాక్‌లో హోటల్‌లో అల్పాహారం చేస్తారు. వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీ కోసం ఎలిఫెంట్ బీచ్‌కు వెళ్తారు. సాయంత్రం హోటల్‌కు తిరిగి వెళ్తారు. హావ్‌లాక్ ద్వీపంలో డిన్నర్, రాత్రి బస చేస్తారు.

డే 4

అల్పాహారం చేసి చెక్ అవుట్ అవుతారు. కాలా పత్తర్ బీచ్‌కు వెళ్తారు. తరువాత క్రూయిజ్ సమయాల ప్రకారం నెయిల్ ద్వీపానికి బయలుదేరుతారు. హోటల్‌లో చెక్ ఇన్ చేస్తారు. సాయంత్రం సూర్యాస్తమయం కోసం సీతాపూర్ బీచ్ అండ్ లక్ష్మణ్‌పూర్ బీచ్‌ను సందర్శిస్తారు. నెయిల్ ద్వీపంలో డిన్నర్, రాత్రి బస ఉంటుంది.

డే 5

అల్పాహారం చేసి చెక్ అవుట్ చేస్తారు. భరత్‌నగర్ బీచ్‌ను సందర్శిస్తారు. తరువాత క్రూయిజ్ సమయాల ప్రకారం పోర్ట్ బ్లెయిర్‌కు బయలుదేరుతారు. హోటల్‌లో చెక్ ఇన్ చేస్తారు. పోర్ట్ బ్లెయిర్‌లో డిన్నర్, రాత్రి బస ఉంటుంది.

డే 6

హోటల్‌లో అల్పాహారం చేస్తారు. తెల్లవారుజామున చెక్ అవుట్ చేసి పోర్ట్ బ్లెయిర్ విమానాశ్రయంలో వెళ్లి హైదరాబాద్ కు విమానం ఎక్కాలి. మధ్యాహ్నం వరకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

టూర్ ప్యాకేజీ ధరలు

టూర్ ధర సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.65850గా ఉంది. డబుల్ ఆక్యుపెన్సీకి ఒక్కొక్కరికి రూ. 48700 చెల్లించాలి. ట్రిపుల్ ఆక్యూపెన్సీ అయితే ఒక్కొక్కరికి రూ. 46950 పడుతుంది. చైల్డ్ విత్ బెడ్ అయితే రూ. 40450 చెల్లించాలి. చైల్డ్ విత్ ఔట్ బెడ్ అయితే రూ. 37000గా ధరలు నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం www.irctctourism.com వెబ్‌సైట్‌ను సందర్శించండి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More