...
...
Next Story

IRCTC New Year Tour Package : హైదరాబాద్ నుంచి ఐఆర్‌సీటీసీ న్యూ ఇయర్ స్పెషల్ టూర్ ప్యాకేజీ.. కాశ్మీర్‌లో సెలబ్రేషన్స్

IRCTC Mystical Kashmir-New Year Special : న్యూ ఇయర్ వచ్చేస్తోంది. ఈసారి మీరు సెలబ్రెషన్స్ ఎక్కడ ప్లాన్ చేస్తున్నారు? మీకోసం ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. కాశ్మీర్‌లో న్యూఇయర్ ఎంజాయ్ చేయెుచ్చు.

Published on: Nov 23, 2026, 11:00:58 IST
Advertisement

న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఏదో ఒక ప్లేస్‌కు ప్లాన్ చేస్తుంటారు. అలాంటివారికోసం ఐఆర్‌సీటీసీ అద్భుతమైన ప్యాకేజీని తీసుకొచ్చేంది. కొత్త ఏడాదిలో భాగంగా కొత్త ప్రదేశాలను కూడా మీరు చూడవచ్చు. సెలబ్రేషన్స్ కూడా చేసుకున్న ఫీల్ ఉంటుంది. డిసెంబర్ 31వ తేదీన ఐఆర్‌సీటీసీ Mystical Kashmir-New Year Special టూర్‌ను ప్రకటించింది. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి టూర్ ప్రారంభం అవుతుంది. ఆరు రోజులు, 5 రాత్రుల టూర్ ప్యాకేజీ ఇది. గుల్మార్గ్, పహల్గాం, సోనామార్గ్, శ్రీనగర్ ప్రాంతాలను సందర్శించి రావొచ్చు. డిసెంబర్ 31వ తేదీ నుంచి జనవరి 5వ తేదీ దాకా టూర్ ఉంటుంది.

డే 1

ఐఆర్‌సీటీసీ న్యూఇయర్ టూర్ ప్యాకేజీ (Unsplash)
ఐఆర్‌సీటీసీ న్యూఇయర్ టూర్ ప్యాకేజీ (Unsplash)

హైదరాబాద్ నుండి మధ్యాహ్నం 2.30కి ఫ్లైట్ ఉంటుంది. సాయంత్రం 5.30కి శ్రీనగర్ విమానాశ్రయానికి చేరుకుంటారు. మిమ్మల్ని హోటల్‌కు తీసుకువెళ్లి చెక్-ఇన్ చేయిస్తారు. సాయంత్రం మీ ఇష్టం. రాత్రి భోజనం, శ్రీనగర్‌లోని హోటల్‌లో బస చేస్తారు.

డే 2

అల్పాహారం తర్వాత శ్రీనగర్ నుండి బయలుదేరి సోన్‌మార్గ్ వైపు ప్రయాణం చేస్తారు. ఇటువైపు వెళ్తుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. సోన్‌మార్గ్ సముద్ర మట్టానికి 2800 మీటర్ల ఎత్తులో, ఆకాశానికి అడ్డంగా మంచుతో కప్పబడిన పర్వతాలను చూస్తారు. సింధు నది ఇక్కడ ప్రవహిస్తుంది, ఇక్కడ ట్రౌట్ చేపలు పుష్కలంగా ఉంటాయి. సందర్శకులు అంతటా తెల్లని తివాచీలా పరచిన మంచును చూడవచ్చు. ప్రధాన ఆకర్షణ అయిన థాజ్‌వాస్ హిమానీనదం వరకు యాత్ర కోసం పోనీలను అద్దెకు తీసుకోవచ్చు. సాయంత్రం శ్రీనగర్‌కు తిరిగి వస్తారు. రాత్రి భోజనం, శ్రీనగర్‌లోని హోటల్‌లో బస.

డే 3

అల్పాహారం చేసి తర్వాత రోడ్డు మార్గంలో గుల్మార్గ్‌కు బయలుదేరుతారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కేబుల్ కార్లలో ఒకటైన గుల్మార్గ్ గోండోలా కారణంగా గుల్మార్గ్ ప్రసిద్ధి చెందింది. ఖిలాన్‌మార్గ్ వరకు ఒక చిన్న ట్రెక్కింగ్ ఉంటుంది. తిరిగి శ్రీనగర్‌కు ప్రయాణం చేస్తారు. శ్రీనగర్‌లోని హోటల్‌లో రాత్రి భోజనం, బస చేస్తారు. గోండోలా కేబుల్ కార్ బుకింగ్ లింక్: https://www.jammukashmircablecar.com/.

డే 4

అల్పాహారం తర్వాత హోటల్ నుండి చెక్-అవుట్ చేసి శ్రీనగర్‌కు బయలుదేరుతారు. ఆ తర్వాత ప్రసిద్ధ శంకరాచార్య ఆలయాన్ని దర్శించుకుంటారు. సాయంత్రం దాల్ సరస్సులో సూర్యాస్తమయం, చార్-చినార్ వీక్షణను ఆస్వాదించడానికి షికారా సవారీ చేయండి. సాయంత్రం హోటల్‌లో చెక్-ఇన్, రాత్రి భోజనం, బస ఉంటుంది.

డే 6

ఉదయాన్నే అల్పాహారం చేసి హోటల్ నుండి చెక్-అవుట్ అవుతారు. అనంతరం మొఘల్ గార్డెన్స్, బొటానికల్ గార్డెన్ లేదా షాలిమార్ గార్డెన్స్ సందర్శన ఉంటుంది. 2027 జనవరి 5వ తేదీన తిరుగు ప్రయాణం కోసం శ్రీనగర్ విమానాశ్రయానికి వస్తారు. హైదరాబాద్‌కు విమానం సాయంత్రం 6:05కి ఉంటుంది. రాత్రి 9.15కి హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

టూర్ ప్యాకేజీ ధరలు

పరిస్థితుల ఆధారంగా టైమ్ టైమింగ్స్‌లు మార్పు ఉండవచ్చు అని ఐఆర్‌సీటీసీ తెలిపింది. ఈ టూర్‌లో సింగిల్ ఆక్యుపెన్సీ రూ.48275, డబుల్ రూ.42675, ట్రిపుల్ రూ.41120, చైల్డ్ విత్ బెడ్ రూ.33835, చైల్డ్ వితౌట్ బెడ్ రూ.31470, చైల్డ్ వితౌట్ బెడ్ 2 నుంచి 4 ఏళ్ల వరకు రూ.30850గా నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ www.irctctourism.comను సంప్రదించండి.

 

ABOUT THE AUTHOR

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks