డిసెంబర్‌లో కూడా చాలా మంది టూర్స్ ప్లాన్ చేసుకుంటారు. కానీ ప్లానింగ్ అనేది ఇందుకు ముఖ్యం. ఎక్కడికి వెళ్లాలి అనేది కూడా క్లారిటీ ఉండాలి. ఎలాంటి టెన్షన్ లేకుండా కేవలం టూర్ మాత్రమే ఎంజాయ్ చేసి రావాలనుకుంటే మాత్రం ఐఆర్‌సీటీసీ అద్భుతమైన ప్యాకేజీలు అందిస్తోంది. అందులో భాగంగా డిసెంబర్ 4వ తేదీన మార్వెల్స్ ఆఫ్ మహారాష్ట్ర టూర్ ఆపరేట్ చేస్తోంది. 4 రోజులు, 3 రాత్రుల టూర్ ప్యాకేజీ ఇది. అజంతా, శంభాజీనగర్, ఎల్లోరాను చూసి రావొచ్చు. ప్రతీ శుక్రవారం ఈ టూర్ ఉంటుంది. కాచిగూడ నుంచి సాయంత్రం 6.30 గంటలకు ట్రైన్ బయల్దేరుతుంది.
మెుదటి రోజు శుక్రవారం

కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి రైలు నం. 17064 (అజంతా ఎక్స్‌ప్రెస్)లో సాయంత్రం 6:30 గంటలకు బయలుదేరుతుంది. రాత్రంతా ప్రయాణం చేస్తారు.
రెండో రోజు శనివారం
ఛత్రపతి శంభాజీనగర్ రైల్వే స్టేషన్‌కు ఉదయం 5:25 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుండి హోటల్‌కు వెళ్తారు. హోటల్‌లో అల్పాహారం చేస్తారు. ఎల్లోరా గుహలు, గృష్ణేశ్వర ఆలయాన్ని సందర్శిస్తారు. సాయంత్రం బీబీ కా మక్బరాను సందర్శించి. రాత్రికి శంభాజీనగర్‌లోనే బస చేస్తారు.
మూడో రోజు ఆదివారం
అల్పాహారం ముగించుకుని, హోటల్ నుండి చెక్-అవుట్ అవుతారు. అజంతాకు బయలుదేరుతారు(100 కి.మీ.). అజంతా గుహలను సందర్శిస్తారు. సాయంత్రం తిరిగి శంభాజీనగర్‌కు వస్తారు. రాత్రి 8 గంటలకు ఛత్రపతి శంభాజీనగర్ రైల్వే స్టేషన్ వద్ద దిగుతారు. రాత్రి 10:45 గంటలకు రైలు నం. 17063లో బయలుదేరుతారు. రాత్రంతా ప్రయాణం చేస్తారు.
నాలుగో రోజు సోమవారం
ఉదయం 9:45 గంటలకు కాచిగూడ చేరుకుంటారు. దీంతో మార్వెల్స్ ఆఫ్ మహారాష్ట్ర టూర్ ముగుస్తుంది.
టూర్ ప్యాకేజీ బడ్జెట్
టూర్ ప్యాకేజీలో ఒకరి నుంచే ముగ్గురి ప్యాసింజర్లకు కంఫర్ట్ క్లాస్ సింగిల్ షేరింగ్ రూ.22730, ట్విన్ షేరింగ్ రూ.13340, ట్రిపుల్ షేరింగ్ రూ.10700, చైల్డ్ విత్ బెడ్ రూ.6550, చైల్డ్ వితౌట్ బెడ్ రూ.5550. అదే స్టాండర్డ్ వరుసగా రూ.21230, రూ. 11830, రూ.9200, రూ.5050, రూ.4050గా ఉంది.
నలుగురి నుంచి ఆరుగురు ప్యాసింజర్లకు చూసుకుంటే.. కంఫర్ట్ క్లాస్ ట్విన్ షేరింగ్ రూ.10810, ట్రిపుల్ షేరింగ్ రూ.10150, చైల్డ్ విత్ బెడ్ రూ.6550, చైల్డ్ వితౌట్ బెడ్ రూ.5550, స్టాండర్డ్ క్లాసులో చూసుకుంటే వరుసగా రూ.9310, రూ.8640, రూ.5050, రూ.4050గా నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ www.irctctourism.com ను సందర్శించండి.
{{/usCountry}}నలుగురి నుంచి ఆరుగురు ప్యాసింజర్లకు చూసుకుంటే.. కంఫర్ట్ క్లాస్ ట్విన్ షేరింగ్ రూ.10810, ట్రిపుల్ షేరింగ్ రూ.10150, చైల్డ్ విత్ బెడ్ రూ.6550, చైల్డ్ వితౌట్ బెడ్ రూ.5550, స్టాండర్డ్ క్లాసులో చూసుకుంటే వరుసగా రూ.9310, రూ.8640, రూ.5050, రూ.4050గా నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ www.irctctourism.com ను సందర్శించండి.
{{/usCountry}}ABOUT THE AUTHOR
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.