...
...
Next Story

హైదరాబాద్ టు కోనసీమ - ఈ ప్రాంతాలన్నీ చూడొచ్చు, IRCTC టూర్ ప్యాకేజీ ఇదిగో

కోనసీమలోని ప్రముఖ ప్రాంతాలను చూడాలనుకుంటున్నారా..? అయితే మీకోసమే ఐఆర్సీటీసీ టూరిజం సరికొత్త ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఇదే నెలలో హైదరాబాద్ నుంచి జర్నీ ఉంది. పూర్తి వివరాలను ఇక్కడ చూడండి…..

Published on: Nov 16, 2025, 11:29:21 IST
Advertisement

ఐఆర్సీటీసీ టూరిజం వేర్వురు ప్యాకేజీలను తీసుకువస్తోంది. ఇందులో అధ్యాత్మిక టూర్ ప్యాకేజీలు కూడా ఉన్నాయి. అయితే కొత్తగా హైదరాబాద్ నుంచి మరో ప్యాకేజీని ప్రకటించింది. "గోదావరి టెంపుల్ టూర్" పేరుతో ఆపరేట్ చేయనుంది. ఇదే నెలలో జర్నీ ఉంటుంది.

కోనసీమ (image source FB (Konaseema))
కోనసీమ (image source FB (Konaseema))

టూర్ ప్యాకేజీలో భాగంగా కోనసీమలోని ప్రముఖ ఆలయాలతో పాటు మరికొన్ని ప్రాంతాలు చూడొచ్చు. అంతర్వేది, అన్నవరం, ద్రాక్షరామం వంటి ఆలయాలను దర్శించుకోవచ్చు. ఇందుకు సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి…

  • టూర్ ప్యాకేజీ పేరు - గోదావరి టెంపుల్ టూర్ ప్యాకేజీ
  • ప్రస్తుతం ఈ ప్యాకేజీ 21, నవంబర్ , 2025వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో ప్లాన్ చేసుకోవచ్చు.
  • ఆసక్తి ఉన్నవాళ్లు https://www.irctctourism.com/ వెబ్ సైట్ నుంచి టికెట్లు బుకింగ్ చేసుకోవాలి. హైదరాబాద్ నుంచి జర్నీ ఉంటుంది.
  • లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి రాత్రి 08.30 గంటలకు, సికింద్రాబాద్ నుంచి అయితే 9.15 గంటలకు గౌతమి ఎక్స్ ప్రెస్(రైలు నెంబర్ 12738) బయల్దేరుతుంది. రాత్రంతా జర్నీ ఉంటుంది.
  • రెండో రోజు ఉదయం 4.38 గంటలకు రాజమండ్రి స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి హోటల్ కి వెళ్తారు. ఆ తర్వాత అన్నవరం దర్శనం పూర్తవుతుంది. గోదావరి ఘాట్, ఇస్కాన్ టెంపుల్ చూస్తారు. రాత్రి రాజమండ్రిలోనే ఉంటారు.
  • 3వ రోజు అంతర్వేదికి వెళ్తారు. నర్సింహ్మా స్వామి దర్శనం ఉంటుంది. బీచ్ ను సందర్శిస్తారు. అక్కడ్నుంచి బాలాజీ టెంపుల్, అప్పన్నపల్లి, విఘ్నేశ్వరం టెంపుల్, ఐనవల్లి చూస్తారు. సాయంత్రం ద్రాక్షరామం వెళ్తారు. రాత్రి రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి జర్నీ ఉంటుంది.
  • నాల్గో రోజు ఉదయం 4.35 నిమిషాలకు సికింద్రాబాద్, 5.55 నిమిషాలకు లింగంపల్లికి చేరుకోవటంతో ఈ టూర్ ముగుస్తుంది.

టూర్ ప్యాకేజీ ధరలు:

కంఫర్ట్ క్లాస్ లో సింగిల్ షేరింగ్ కు రూ. 15,340, డబుల్ షేరింగ్ కు రూ. 8940, ట్రిపుల్ షేరింగ్ కు రూ. 7170గా ఉంది. అదే స్టాండర్డ్ క్లాస్ లో అయితే ట్రిపుల్ షేరింగ్ కు రూ, 5630, డబుల్ షేరింగ్ కు రూ. 7400గా నిర్ణయించారు. ఇక సింగిల్ షేరింగ్ కు అయితే రూ. 13,800గా ఉంది. ఈ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 8287932229 / 8287932228 / 9701360701 నెంబర్లను సంప్రదించవచ్చు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks