ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.
Harish Rao-Jaggareddy : 21 ఏళ్ల తర్వాత కలుసుకున్న జగ్గారెడ్డి, హరీశ్ రావు
Harishrao-Jaggareddy meeting : కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు 21 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. ఫ్యామిలీ ఫంక్షన్లో నేతలు కలుసుకున్న ఫోటోలు వైరల్ అయ్యాయి.
కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ఒకే వేదికపై కలిశారు. విరిద్దరూ ఇలా కలుసుకోవడం 21 ఏళ్ల తర్వాత జరిగింది. దీంతో ఇటు జగ్గారెడ్డి అభిమానులు, అటు హరీశ్ రావు అభిమానులు వీరిద్దరు కలిసిన ఫోటోలను వైరల్ చేస్తున్నారు. అయితే వీరిద్దరూ కలిసింది రాజకీయ వేదిక కాదు. జగ్గారెడ్డి కుమారుడి పెళ్లి వేడుక సందర్భంగా హరీశ్ రావు వెళ్లారు. జగ్గారెడ్డి కుమారుడు భరత్ సాయి రెడ్డి-కోడలు పాలక్ పటేల్‌ను హరీశ్ రావు ఆశీర్వదించారు. కాసేపు హరీశ్-జగ్గారెడ్డి మాట్లాడుకున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.

ఈ నేతలిద్దరూ కలుసుకోవడంతో అందరిలోనూ రాజకీయపరమైన చర్చ మెుదలైంది. దీనిపై జగ్గారెడ్డి క్లారిటీ ఇచ్చారు. '2004లో హరీశ్ రావు మంత్రిగా ఉన్నప్పుడు, నేను ఆయనతో కలిసి ఛాంబర్లో భోజనం చేసే వాళ్ళం. ఆ తర్వాత నేను కాంగ్రెస్‌లో వచ్చాక.. మళ్ళీ ఇప్పటి వరకు హరీశ్ రావుని కలవలేదు. 21 ఏళ్ల తర్వాత మొదటిసారి మళ్ళీ ఫ్యామిలీ ఫంక్షన్లో కలిశాం. కూతురి పెళ్లికి హరీష్ రావుని పిలవలేకపోయాను. కానీ ఈ ఫంక్షన్ మిస్ కావొద్దని ఆహ్వానించాను. మా ఇద్దరి కలయికలో ఎటువంటి రాజకీయాలు లేవు. మా కలయికలో ఎటువంటి మతలబు లేదు. రాజకీయం...రాజకీయమే హరీష్ రావు బీఆర్ఎస్లో అగ్రనేత. నేను కాంగ్రెస్‌లో టాప్ లీడర్ కాకపోయినా ఓ స్థాయి లీడర్నే. అనేక ఫంక్షన్లకు ఆయన్ని పిలవలేకపోయాను. పదేళ్లు హరీష్ రావు మంత్రిగా ఉన్న సమయంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నా ఆయన్ని కలవలేదు.' అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.
నవంబర్ 25వ తేదీన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి-నిర్మల దంపతుల కుమారుడు భరత్‌సాయిరెడ్డి పెళ్లి రమేష్ పటేల్-మాయా పటేల్ కుమార్తె పాలక్‌తో సంగారెడ్డిలోని గంజ్ మైదాన్‌లో జరిగింది. ఈ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మంత్రులు కొమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనరసింహ, అజారుద్దీన్, సీతక్క, వివేక్, ఎంపీ వేం నరేందర్ రెడ్డితోపాటుగా ప్రముఖులు హాజరయ్యారు. కుమారుడి పెళ్లి సందర్భంగా జగ్గారెడ్డి చేసిన డ్యాన్స్ వీడియోలు వైరల్ అయ్యాయి.

E-Paper
