ప్రజాభవన్‌లో జగిత్యాల పంచాయితీ సెటిల్‌మెంట్.. ఎట్టకేలకు వివాదానికి ఫుల్‌స్టాప్ పడినట్టేనా?
కొన్ని రోజులుగా జగిత్యాల కాంగ్రెస్ పార్టీలో వివాదం నడుస్తోంది. హస్తం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మధ్య రచ్చ రచ్చ జరుగుతోంది. ఇదే సమయంలో మున్సిపల్ ఎన్నికలు కూడా వచ్చాయి. దీంతో మున్సిపల్ ఛైర్ పర్సన్ పదవిపై ఉత్కంఠ నెలకొంది.
కొన్ని రోజులుగా జగిత్యాల జిల్లాలో నడుస్తున్న రాజకీయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. సీనియర్ నేత జీవన్ రెడ్డికి తగిన ప్రాధాన్యత లభించడం లేదనే వాదన బలంగా జనాల్లోకి వెళ్లింది. మెుదటి నుంచి పార్టీలో ఉన్న తనకు, తన వర్గానికి సరైన గౌరవం దక్కడం లేదని జీవన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే సంజయ్ వర్గంతో వివాదం నడుస్తోంది. ఇదే సమయంలో మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి. ఇక మున్సిపల్ ఛైర్ పర్సన్ స్థానంపై మరింత వివాదం చెలరేగింది.

కాంగ్రెస్ భీ ఫారంపై గెలిచిన కౌన్సిలర్లు, స్వతంత్రులు, ఎంఐఎంతో కలిపి మెుత్తం 23 మందితో ఎమ్మెల్యే సంజయ్ ప్రత్యేక క్యాంపు పెట్టారు. మరోవైపు 14 మంది అభ్యర్థులతో జీవన్ రెడ్డి హైదరాబాద్ వచ్చారు. దీంతో మున్సిపల్ ఛైర్ పర్సన్ ఎన్నికపై ఆసక్తి నెలకొంది.
ఇక ఈ పంచాయితీకి ఫుల్‌స్టాప్ పెట్టేందుకు ఏఐసీసీ రంగంలోకి దిగింది. జీవన్ రెడ్డి, సంజయ్ వర్గాల మధ్య విభేదాలను పరిష్కరించడానికి కీలక చర్చలు చేశారు. దాదాపు జగిత్యాల ఎపిసోడ్ ఫైనల్‌కు వచ్చినట్టే కనిపిస్తోంది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌తో ఏఐసీసీ సెక్రటరీ సవాంగ్ విడివిడిగా సమావేశం అయ్యారు. హైదరాబాద్‌లో ఉన్న జీవన్ రెడ్డి.. ప్రజా భవన్‌లో సవాంగ్‌ను కలిశారు. పార్టీ అంతర్గత విషయాలను రోడ్డుపైకి తీసుకురావడంతో కేడర్‌లో అయోమయం ఉందని ఇరువురి నేతలను హెచ్చరించినట్టుగా సమాచారం. పార్టీ తీసుకునే నిర్ణయానికి ఇద్దరు నేతలు కట్టుబడి ఉండాలన్నారు.
పార్టీ కోసం కష్టపడేవారికే.. మున్సిపల్ ఛైర్ పర్సన్ పదవి ఇవ్వాలని నేతలు నిర్ణయించారు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా సంజయ్ కుమార్, ఆయన వర్గం కూడా సర్దుకుపోయేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. అంతేకాదు నేతలు ఇద్దరూ.. కలిసి పని చేస్తామని హామీ ఇచ్చారట. విధేయతకే పెద్దపీట వేయాలని పార్టీ నిర్ణయించింది.
కాంగ్రెస్ హైకమాండ్ జీవన్ రెడ్డి, సంజయ్ మధ్య రెండు ప్రతిపాదనలు పెట్టినట్టుగా తెలుస్తోంది. మెుదటిది ఛైర్ పర్సన్ పీఠం సంజయ్ వర్గానికి, వైస్ ఛైర్మన్ పదవి జీవన్ వర్గానికి. అయితే రెండో ప్రతిపాదన ఏంటంటే.. చెరో రెండున్నర సంవత్సరాలు ఛైర్ పర్సన్ పీఠం పంచుకునేలా సూచించారు. జీవన్ రెడ్డి మాత్రం.. కాంగ్రెస్ జెండా మోసిన వారికే ఛైర్ పర్సన్ పీఠం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తన వర్గంతో చర్చించాక నిర్ణయం తీసుకోవాలన్నారు.
'కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలి. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా.. కట్టుబడి ఉంటాను. పార్టీ జెండా మోసినవారికే పదవులు ఇవ్వాలని బలంగా అనుకునే వ్యక్తిని నేను. నా అభిప్రాయాలు, సూచనలు పరిగణనలోకి తీసుకోవాలని చెప్పాను.' అని జీవన్ రెడ్డి మాట్లాడారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


