...
...
Next Story

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల బరిలో జనసేన - కీలక ప్రకటన

తెలంగాణలో జరగబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో జనసేన పార్టీ బరిలో ఉండనుంది. ఈ మేరకు కార్యాచరణను సిద్ధం చేయనుంది. ఇందుకు సంబంధించి జనసేన ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్‌ పేరిట ప్రకటన విడుదలైంది.

Published on: Jan 11, 2026, 07:00:03 IST
Advertisement

త్వరలో తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు సిద్ధమయ్యే పనిలో పడ్డాయి. ఈ క్రమంలోనే జనసేన పార్టీ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర జనసేన ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్‌ పేరిట ప్రకటన విడుదలైంది.

జనసేన పార్టీ
జనసేన పార్టీ

హైదరాబాద్ లోని కేపీహెచ్‌బీలోని పార్టీ కార్యాలయంలో శనివారం అడహాక్‌ కమిటీ సభ్యులకు శిక్షణ నిర్వహించారు. ఇందులో పలు అంశాలపై చర్చించారు. సాధ్యమైనన్నీ స్థానాల్లో జనసేన తరపున అభ్యర్థులను నిలపాలని జనసేన పార్టీ నిర్ణయించింది. తెలంగాణలో కూడా జనసేన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలని దిశానిర్దేశం చేసింది.

పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేలా కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నందున ప్రతీ జనసైనికుడు, వీరమహిళ ఉత్సాహంగా ఎన్నికల ప్రచారానికి సిద్ధం కావాలని పార్టీ నాయకత్వం పిలుపునిచ్చింది. త్వరలోనే ఎన్నికల కార్యాచరణను ప్రకటించనుంది.

మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ జనసేన పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా జనసేన నాయకత్వం అడుగులు వేస్తోంది. ప్రజల్లోకి పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలను బలంగా తీసుకెళ్లే లక్ష్యం తో జీహెచ్‌ఎంసీ అడ్హాక్ కమిటీల ఏర్పాటు ప్రక్రియను పార్టీ వేగవంతంగా కొనసాగిస్తోంది.

శిక్షణా కార్యక్రమంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, గ్రౌండ్ లెవల్‌లో చేయాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశంచేస్తున్నారు ప్రజలతో అ.నుసంధానం, రానున్న జీహెచ్‌ఎంసీ, మున్సిపల్ ఎన్నికలకు పార్టీ ఎలా సిద్ధమవుతున్నది అనే అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో, అంకితభావంతో పనిచేయాలని నాయకులు పిలుపునిస్తున్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe