జనగామ జిల్లాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. దరఖాస్తుకు అక్టోబర్ 31 లాస్ట్ డేట్
జనగామ జిల్లాలో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 31వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేయాలి.
జనగామ జిల్లా నిరుద్యోగులకు కలెక్టర్ కార్యాలయం తీపి కబురు అందించింది. జిల్లా సంక్షేమ అధికారి (WCD & SC) పరిధిలోని సఖి వన్ స్టాప్ సెంటర్, మిషన్ వాత్సల్య - జిల్లా శిశు పరిరక్షణ విభాగం (DCPU), చైల్డ్ హెల్ప్ లైన్ (1098) లలో ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేసేందుకు ఒప్పంద నియామకాలకు ప్రకటన జారీ చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 13 ఖాళీలను వివిధ విభాగాల వారీగా భర్తీ చేయనున్నారు.

పోస్టుల వివరాలు
సెంటర్ అడ్మినిస్ట్రేటర్ (సఖి) - 01 పోస్టు: లా (Law), సోషల్ వర్క్, సోషియాలజీ, సోషల్ సైన్స్ లేదా సైకాలజీలో మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాలి.
సైకో సోషల్ కౌన్సెలర్ (సఖి) - 01 : సైకాలజీ, సైకియాట్రీ లేదా న్యూరోసైన్సెస్‌లో ప్రొఫెషనల్ డిగ్రీ లేదా డిప్లొమా ఉండి ఆరోగ్య రంగంలో అనుభవం ఉండాలి.
పారా మెడికల్ సిబ్బంది (సఖి) - 01 : B.Sc నర్సింగ్, GNM, MPHW (Female) లేదా గుర్తింపు పొందిన పారామెడికల్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
మల్టీ పర్పస్ స్టాఫ్ / కుక్ (సఖి) - 01 : చదవడం, రాయడం తెలిసుండాలి (టెన్త్ క్లాస్ పాసైన వారికి ప్రాధాన్యం).
సెక్యూరిటీ గార్డ్ / నైట్ గార్డ్ (సఖి) - 01 : పదో తరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు.
డ్రైవర్ (చైల్డ్ హెల్ప్ లైన్ 1098) - 01 : పదో తరగతి అర్హతతో పాటు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
డేటా ఎంట్రీ ఆపరేటర్ (CWC) - 01 : ఏదైనా డిగ్రీతో పాటు కంప్యూటర్లలో డిప్లొమా లేదా సర్టిఫికేట్ కోర్సు చేసి ఉండాలి.
ఫార్మాసిస్ట్ (చైల్డ్ హోమ్) - 01 : D.Pharm, B.Pharm లేదా Pharma.D విద్యార్హత కలిగి తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి.
ప్రొటెక్షన్ ఆఫీసర్ ఇన్ స్టిట్యూషనల్ కేర్ (DCPU) - 01 : సోషల్ వర్క్, సోషియాలజీ, చైల్డ్ డెవలప్‌మెంట్, హ్యూమన్ రైట్స్, లా వంటి విభాగాల్లో పీజీ పూర్తి చేసి ఉండాలి.
సూపర్ వైజర్ (చైల్డ్ హెల్ప్ లైన్ 1098) - 02 : సోషల్ వర్క్, కంప్యూటర్ సైన్స్, ఐటీ లేదా సోషియాలజీ వంటి సబ్జెక్టులలో డిగ్రీ (B.A) ఉత్తీర్ణులై ఉండాలి.
కేస్ వర్కర్ (చైల్డ్ హెల్ప్ లైన్ 1098) - 02 పోస్టులు: లా, సోషల్ వర్క్, సోషియాలజీ, లేదా సైకాలజీ విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి.
అభ్యర్థుల కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. సెంటర్ అడ్మినిస్ట్రేటర్ పోస్టుకు గరిష్ఠ వయోపరిమితి 50 ఏళ్లుగా, మిగతా అన్ని పోస్టులకు గరిష్ఠంగా 44 ఏళ్లుగా నిర్ణయించారు. రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఆధారంగా మెరిట్ జాబితా రూపొందించి పారదర్శకంగా ఎంపికలు జరుపుతారు.
పరీక్షకు హాజరయ్యే ప్రతీ అభ్యర్థికి మెడికల్ టెస్ట్ అని అధికారులు స్పష్టం చేశారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, పూర్తి చేసిన దరఖాస్తుకు అవసరమైన సర్టిఫికేట్ల (SSC, ఇంటర్, డిగ్రీ/పీజీ మేమోలు, కుల ధ్రువీకరణ, 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు తదితర) నకళ్లను జతచేయాల్సి ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ 31.10.2026 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను జనగామ కలెక్టరేట్‌లోని ఇన్ వార్డ్ సెక్షన్‌లో నేరుగా లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా అందజేయాలి.
01.11.2026 ఉదయం 11 రాత పరీక్షను మెయిన్ కాన్ఫరెన్స్ హాల్, IDOC కాంప్లెక్స్, కలెక్టరేట్, జనగామలో నిర్వహిస్తారు. అర్హత కలిగిన నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని తక్షణమే వినియోగించుకోవాలని జిల్లా యంత్రాంగం సూచించింది. దరఖాస్తు, ఇతర వివరాల కోసం జనగామ జిల్లా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


