SSC Public Exams March 2027 : తెలంగాణ టెన్త్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల
SSC Public Exams March 2027 : తెలంగాణ టెన్త్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదలైంది. గడువు తేదీలు, రుసుము వివరాలు ఇక్కడ చూడండి.
తెలంగాణలో మార్చి 2027లో జరగనున్న పదో తరగతి(SSC), ఓఎస్‌ఎస్‌సీ (OSSC), ఒకేషనల్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి పరీక్షా రుసుము చెల్లింపుల షెడ్యూల్‌ను ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారికంగా విడుదల చేసింది. హైదరాబాద్‌లోని డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ కార్యాలయం పత్రికా ప్రకటన ద్వారా ఈ వివరాలను వెల్లడించింది.

రెగ్యులర్ విద్యార్థులతో పాటు గతంలో తప్పిన విద్యార్థులు కూడా ఈ పరీక్షలకు ఫీజు చెల్లించవచ్చని స్పష్టం చేసింది. పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపుల షెడ్యూల్‌ను చూడండి. ఫైన్ లేకుండా 30-10-2026 నుండి 16-11-2026 వరకు ఫీజు చెల్లించవచ్చు. హెడ్‌మాస్టర్ల ద్వారా సైబర్ ట్రెజరీకి ఫీజు చేయాల్సిన తేదీలు 04-11-2026 నుండి 17-11-2026 వరకు అవకాశం ఇచ్చారు.
రూ. 50 ఆలస్య రుసుముతో 18-11-2026 నుండి 01-12-2026 వరకు చెల్లించవచ్చు. రూ. 200 ఆలస్య రుసుముతో 03-12-2026 నుండి 14-12-2026 వరకు పరీక్షల ఫీజు చెల్లించాలి. రూ. 500 ఫైన్‌తో 16-12-2026 నుండి 28-12-2026 వరకు ఫీజు చెల్లించవచ్చు.
అక్టోబర్ 30 నుంచి నవంబర్ 16 వరకు లేట్ ఫీ లేకుండా అన్ని సబ్జెక్టులకు రూ. 125 చెల్లించాలి. బ్యాక్‌లాగ్ విద్యార్థులకు మూడు సబ్జెక్టుల వరకు రూ. 110, మూడు సబ్జెక్టుల కంటే ఎక్కువ ఉంటే రూ. 125 చెల్లించాలి. ఒకేషనల్ అభ్యర్థులకు సాధారణ SSC అకడమిక్ పరీక్షల రుసుము రూ. 125కి అదనంగా మరో రూ. 60 చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన అభ్యర్థులకు పరీక్షా రుసుము నుండి మినహాయింపు ఉంటుంది.
పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఉన్నతాధికారులు కీలక సూచనలు చేశారు. పరీక్షా రుసుము చెల్లింపుల గడువు తేదీలను ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించబోమని స్పష్టం చేశారు. ఫీజు చెల్లింపు ప్రక్రియ అంతా సైబర్ ట్రెజరీ ద్వారా www.bse.telangana.gov.in అధికారిక వెబ్‌సైట్‌లోని స్కూల్ లాగిన్ ద్వారా మాత్రమే చేయాలి.
IFMIS పోర్టల్ చలానాలు లేదా మ్యాన్యువల్ బ్యాంక్ చలానాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. ఫీజు జమ చేయడానికి చివరి తేదీ వరకు వేచి చూడకుండా వెంటనే ప్రక్రియ పూర్తి చేయాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. ఆన్‌లైన్ దరఖాస్తు లింక్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది.
HM/పాఠశాల ప్రిన్సిపాళ్లు తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ద్వారా లాగిన్ అయి వివరాలు నమోదు చేయాలి. అభ్యర్థులు లేదా హెడ్‌మాస్టర్లు ఇతర వివరాల కోసం తమ సంబంధిత ఉన్నతాధికారులను సంప్రదించవచ్చు. లేదా బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ను చూడవచ్చు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


