...
...
Next Story

నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి అడ్మిషన్లు.. నోటిఫికేషన్ విడుదల

విద్యార్థులకు గుడ్‌న్యూస్. దేశవ్యాప్తంగా జవహర్ నవోదయ విద్యాలయాల్లో(JNV) ఆరో తరగతి ప్రవేశాల కోసం అడ్మిషన్ ప్రక్రియ మెుదలైంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు జులై 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.

Published on: Jul 7, 2026, 16:07:33 IST
Advertisement

దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో(JNV) ఉచిత, నాణ్యమైన విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చింది. 2027-28 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతి ప్రవేశాలకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదలైంది. అర్హులైన విద్యార్థుల నుండి ప్రవేశ పరీక్ష కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 665 నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలు జరగనున్నాయి.

జవహర్ నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలు
జవహర్ నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలు

ముఖ్యమైన తేదీలు చూసుకుంటే.. దరఖాస్తుకు చివరి తేదీ జులై 31 వరకే ఉంది. ప్రవేశ పరీక్ష నవంబర్ 28న ఉంటుంది. 2027 మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో ఫలితాలు ప్రకటిస్తారు. నవంబర్ 28న జరగనున్న JNV ప్రవేశ పరీక్షలో విద్యార్థులు సాధించిన మెరిట్ (మార్కులు) ఆధారంగా మాత్రమే పారదర్శక పద్ధతిలో ప్రవేశాలు ఉంటాయి.

ప్రవేశ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 665 జవహర్ నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలు కల్పిస్తారు. చివరి నిమిషంలో హడావిడిని నివారించడానికి, ఆసక్తి గల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వెంటనే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి. దరఖాస్తు ప్రక్రియ, సిలబస్, ఇతర సమాచారం కోసం దయచేసి నవోదయ విద్యాలయ సమితి అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

జవహర్ నవోదయ విద్యాలయాల్లో సీటు వచ్చిన విద్యార్థి.. ఆరో తరగతి నుంచి 12వ తరగతి దాకా చదువుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ చదువుతోపాటుగా గేమ్స్, సమగ్ర వికాసానికి కూడా ప్రాధాన్యత ఉంటుంది. తెలంగాణలో 9, ఆంధ్రప్రదేశ్‌లో 9 జవహర్ నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. ఒక్కోదాంట్లో గరిష్టంగా 80 మంది విద్యార్థుల వరకు ఆరో తరగతిలో అడ్మిషన్ ఉంటుంది.

ఈ లింక్ క్లిక్ చేసి అధికారిక వెబ్‌సైట్ వెళ్లండి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe