...
...
Next Story

Jayalalithaa House Seize : హైదరాబాద్‌లో తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఇల్లు సీజ్

Jayalalithaa House Seize : హైదరాబాద్‌లో తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఇంటిని అధికారులు సీజ్ చేశారు. ఇందుకు కారణంగా ఆస్తి పన్ను బకాయిలు.

Updated on: Mar 31, 2026, 12:06:31 IST
Advertisement

ఆస్తి పన్ను చెల్లించనందుకు దివంగత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చెందిన హైదరాబాద్‌లోని ఇంటిని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) సీజ్ చేసింది. యూసుఫ్‌గూడలో ఉన్న ఈ ఇంటికి చాలా సంవత్సరాలుగా బకాయిలు చెల్లించకపోవడంతో సీల్ వేసినట్లు అధికారులు తెలిపారు. జయలలితకు యూసుఫ్‌గూడ జీహెచ్‌ఎంసీ సర్కిల్‌-38 పరిధి శ్రీనగర్‌కాలనీలో జీ ప్లస్ 4తో భవనం ఉంది. జయలలిత పేరుతో ఇంటి నంబరు 8-3-1099/ఎ (పీటీఐఎన్‌ నంబరు.1100833474)గా రిజిస్ట్రేషన్ అయి ఉన్నది.

జయలలిత(ఫైల్ ఫొటో)
జయలలిత(ఫైల్ ఫొటో)

ఆస్తి పన్నుకు సంబంధించి మొత్తం బకాయిలు రూ.83 లక్షలుగా ఉన్నాయి. ఆస్తి యజమానులకు పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ, 2017 నుంచి ఆస్తి పన్ను చెల్లించలేదని అధికారులు తెలిపారు. పదేపదే పంపిన రిమైండర్లకు స్పందన లేకపోవడంతో బకాయిలను వసూలు చేయడానికి జీహెచ్‌ఎంసీ మున్సిపల్ చట్టాలలోని నిబంధనలను ప్రయోగించింది.

పన్ను బకాయి మొత్తం సుమారు రూ.83 లక్షలుగా అంచనా వేశారు. నగరవ్యాప్తంగా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఆస్తి పన్నులను వసూలు చేసే చర్యలో భాగంగానే ఈ స్వాధీనం జరిగిందని అధికారులు తెలిపారు. నగరవ్యాప్తంగా పన్ను ఎగవేతదారులపై చర్యలు కొనసాగుతున్నాయి

2017 నుంచి జయలలితకు చెందిన ఇంటికి సంబంధించిన ఆస్తి పన్ను బకాయిలు అలానే ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ భవనానికి సంబంధించిన ఆస్తి పన్ను బకాయిల్ని చెల్లించాలని జీహెచ్‌ఎంసీ అధికారులు నోటీసులు కూడా ఇచ్చారు. అయినా ఎటువంటి స్పందన లేదు.

సోమవారం రోజున జీహెచ్ఎంసీ అధికారులు భవనాన్ని సీజ్ చేశారు. మార్చి 31 వరకు ఓటీఎస్ స్కీమ్ అందుబాటులో ఉంది. రాయితీ పోగా మిగిలినది జయలలిత భవనానికి సంబంధించిన యజమానులు పే చేయాల్సి ఉంది. ఈ భవనంలో గతంలో ప్రైవేట్ కార్యాలయాన్ని నిర్వహించారు. కమర్షియల్ ఆస్తి కింద పన్ను పడేది. 2017 నుంచి నివాసానికి వాడుకుంటున్నామని, ఈ ఇంటిని రెసిడెన్షియల్‌గా మార్చాలని జీహెచ్ఎంసీ అధికారులను జయలలిత మేనల్లుడు దీపక్ జయకుమార్ కోరారు.

జీహెచ్‌ఎంసీలో ఆస్తిపన్ను వడ్డీలో 90శాతం రద్దును ఇస్తోంది. రాష్ట్ర పురపాలక శాఖ ఓటీఎస్‌(వన్‌ టైం సెటిల్‌మెంట్‌ స్కీమ్) అమలు చేస్తోంది. ఈ ఓటీఎస్‌ పథకం మార్చి 31తో ముగుస్తున్న విషయం తెలిసిందే.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe