Gold Ganesh Idol : హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారు గణేశుడు - డైమండ్స్‌తో ధగధగ, వీడియో ఇదిగో
Gold plated Ganesha idol : హైదరాబాద్ బేగం బజార్‌లోని లిచీ పెరల్ సెట్ జ్యువెలర్స్‌లో 3,83,800 అమెరికన్ డైమండ్లు, 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్‌తో సిద్ధం చేసిన అరుదైన వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించారు. 8 మంది కార్మికులు ఎనిమిది నెలల పాటు కష్టపడి ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దారు.
Gold plated Ganesha idol : గణేష్ చతుర్థి వేడుకల సందర్భంగా హైదరాబాద్ బేగం బజార్‌లోని 'లిచీ పెరల్ సెట్ జ్యువెలర్స్' ఒక అద్భుతమైన గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించింది. 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్‌తో పాటు ఏకంగా 3,83,800 అమెరికన్ డైమండ్లను అమర్చి ఈ విగ్రహాన్ని ఎంతో అద్భుతంగా తయారు చేశారు.

గణేష్ చతుర్థిని పురస్కరించుకుని తమ సంస్థలో వినాయక చవితి వేడుకలు నిర్వహించడం ఇది మూడో ఏడాదని లిచీ పెరల్ సెట్ జ్యువెలర్స్ నిర్వాహకుడు అధర్ అగర్వాల్ తెలిపారు.
"గత రెండేళ్లుగా మేము వినాయకుడిని ప్రతిష్టిస్తున్నాం. ఈ మూడో ఏడాది ఏమైనా ప్రత్యేకంగా చేయాలని భావించాం. ఆ స్వామివారి ఆశీస్సులతోనే ఈ అత్యద్భుతమైన విగ్రహాన్ని రూపొందించాం," అని అధర్ అగర్వాల్ ఏఎన్‌ఐ (ANI) వార్తా సంస్థతో చెప్పారు.
ఇత్తడితో పాటు మొత్తం ఐదు రకాల లోహాలతో (పంచలోహాలు) ఈ విగ్రహాన్ని తయారు చేసినట్లు ఆయన వివరించారు. విగ్రహం వెనుక ఉండే మకరతోరణంపై దశావతారాల రూపాలను చెక్కారు. పైభాగంలో శ్రీ వేంకటేశ్వర స్వామి రూపాన్ని, ఇరువైపులా లక్ష్మీదేవి, సరస్వతీ దేవి ప్రతిమలను తీర్చిదిద్దారు.
డైమండ్లు అమరిక…
"ఈ విగ్రహం నిండా 3,83,800 అమెరికన్ డైమండ్లను అమర్చాం. మేము ఫ్యాషన్ జ్యువెలరీ తయారీలో ఎలాంటి క్వాలిటీ రా మెటీరియల్స్ ఉపయోగిస్తామో, సరిగ్గా అవే వస్తువులతో ఈ గణపతికి జ్యువెలరీ టచ్ ఇచ్చాం," అని అగర్వాల్ పేర్కొన్నారు.
ఈ విగ్రహ తయారీ వెనుక ఎంతో నిష్ణాతులైన కళాకారుల శ్రమ దాగి ఉంది. కార్డ్ డిజైనర్లు, కాస్టింగ్ నిపుణులు, స్టోన్ సెట్టర్లు, పాలిషింగ్ వర్కర్లతో కూడిన ప్రత్యేక బృందం ఎనిమిది నెలల పాటు రాత్రింబవళ్లు శ్రమించి ప్రతీ రాయిని చేతితో అమర్చినట్లు తెలిపారు.
ముంబైలోని సుప్రసిద్ధ 'లాల్‌బాగ్ కా రాజా' రూపురేఖల ఆధారంగా ఈ విగ్రహ బేస్ డిజైన్‌ను రూపొందించారు. పాతబస్తీలో పుట్టి పెరిగిన తమకు వినాయక చవితి ఉత్సవాలతో ప్రత్యేక అనుబంధం ఉందని అగర్వాల్ గుర్తుచేసుకున్నారు. "హైదరాబాద్ పాతబస్తీలో గణేష్ ఉత్సవాలకు ప్రత్యేక స్థానం ఉంది. చిన్నతనం నుంచే గణపతికి ఏదైనా ప్రత్యేకంగా చేయాలనే కోరిక ఉండేది. ఈసారి స్వామివారే మాకు ఆ అవకాశాన్ని, సామర్థ్యాన్ని ఇచ్చారు. అందుకే ఈ అద్భుత ప్రతిమను తయారు చేయగలిగాం," అని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
మరోవైపు ఈ అరుదైన, కంటికింపైన జ్యువెలరీ గణపయ్యను దర్శించుకోవడానికి స్థానికులు, భక్తులు భారీగా తరలివస్తున్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

