...
...
Next Story

SSC Exams 2026 : టెన్త్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా..? జిల్లా కలెక్టర్ సూచించిన ఈ 7 టిప్స్ తెలుసుకోండి

రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ఈనెల 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే విద్యార్థులు పరీక్షల కోసం సిద్ధమవుతున్నారు. కీలకమైన ఈ పరీక్షల వేళ పలువురు విద్యార్థులు ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. అయితే జోగులాంబ జిల్లా కలెక్టర్… విద్యార్థులకు సప్త సూత్రాల పేరిట టిప్స్ సూచించారు.

Published on: Mar 05, 2026 05:27 PM IST
Advertisement

తెలంగాణ టెన్త్ పరీక్షలకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఇప్పటికే హాల్ టికెట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇక పరీక్షలకు సమయం దగ్గరపడుతున్న వేళ విద్యార్థులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు.

టెన్త్ ఎగ్జామ్స్
టెన్త్ ఎగ్జామ్స్

పదో తరగతి పరీక్షల వేళ చాలా మంది విద్యార్థులు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితులను ఎలా ఎదుర్కొవటంతో పాటు పరీక్షలను రాసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పలు సూచనలు చేశారు. అవెంటో ఇక్కడ తెలుసుకోండి……

విద్యార్థి జీవిత ప్రయాణంలో పదో తరగతి పరీక్షలు ఎంతో కీలకమని కలెక్టర్ రిజ్వాన్ భాషా అభిప్రాయపడ్డారు. ఈ పరీక్షలు భవిష్యత్తులో మంచి మార్గాన్ని చూపిస్తాయని… ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో, పట్టుదలతో కృషి చేస్తే విజయం మీ సొంతమవుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా “సప్త సూత్రాలు”ను పేర్కొన్నారు. అవెంటో ఇక్కడ తెలుసుకోండి….

1. లక్ష్యం (Goal) నిర్దేశించుకోండి:

మీరు సాధించాలనుకున్న లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ణయించుకోండి. ప్రతి రోజూ కనీసం 550 పదాలు అభ్యసించే మార్గాలను రూపొందించుకొని చదువుకు ప్రాధాన్యం ఇవ్వండి.

2. సమయపాలన (Time Management) :

పరీక్షల్లో సమయం చాలా అమూల్యమైనది. పరీక్షల కోసం ముందుగా ప్లాన్ చేసుకొని చదవండి. సెల్‌ఫోన్, టీవీ వంటి వ్యర్థాలకు దూరంగా ఉండండి.

3. పునరావృతం (Revision) :

సమయానుకూలంగా పునరావృతం చేస్తూ చదివిన విషయాలను మళ్లీ మళ్లీ చూసుకోండి. కష్టమైన అంశాలను ఎక్కువగా అభ్యసించండి.

4. నిరంతర అభ్యాసం (Practice) :

పాత ప్రశ్నాపత్రాలు, మోడల్ పేపర్లు సాధన చేయండి. గణితం, సైన్స్ వంటి విషయాల్లో ఎక్కువ ప్రాక్టీస్ చేయండి.

5. Good Handwriting :

పరీక్షల్లో స్పష్టంగా, శుభ్రంగా వ్రాయండి. మంచిగా రాస్తే పేపర్ వాల్యూయేషన్ సమయంలో సులభంగా అర్థం చేసుకుంటారు.

6. ఆత్మవిశ్వాసం (Self Confidence) :

సమతుల్య ఆహారం తీసుకోండి. సరైన నిద్ర తీసుకోండి. ధ్యానం (Meditation) చేయడం ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకోండి.

ఇక రాష్ట్రంలోని 2,676 కేంద్రాలలో 5.28 లక్షలకు పైగా విద్యార్థులు మార్చి 14 నుండి పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. ఈ పరీక్షలు ఏప్రిల్ 16 వరకు కొనసాగుతాయి. తాజాగానే హాల్ టికెట్లు విడుదలయ్యాయి. వీటిని అధికారిక వెబ్‌సైట్‌(www.bse.telangana.gov.in)లో ఉంచారు. ఈసారి వాట్సాప్(8096958096) ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe