జూబ్లీహిల్స్ ఎగ్జిట్ పోల్స్.. కారుపై చేయిదే పైచేయి అంటున్న సర్వేలు!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. పలు సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను విడుదల చేశాయి. రెండు ప్రధాన పార్టీల మధ్యే పోరు నడిచింది. ఎగ్జిట్ పోల్స్.. గెలుపు ఎవరి వైపు అంచనా వేశాయో చూద్దాం..

Updated on: Nov 11, 2025, 19:08:54 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది. పలు సర్వే సంస్థలు తమ ఎగ్టిట్ పోల్స్‌ ఫలితాలను ప్రకటించాయి. ప్రధానంగా రెండు పార్టీల మధ్యే పోటీ అని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. ఇప్పటి వరకు సర్వేలు కాంగ్రెస్ పార్టీ వైపే మెుగ్గు చూపాయి. కాంగ్రెస్‌కు చాణక్య స్ట్రాటజీస్-46 శాతం, బీఆర్ఎస్‌కు 41 శాతం, బీజేపీకి 06 శాతం గెలుపు అవకాశం ఉందని అంచనా వేసింది.

జూబ్లీహిల్స్ ఎగ్జిట్ పోల్స్
జూబ్లీహిల్స్ ఎగ్జిట్ పోల్స్

పబ్లిక్ పల్స్ చూసుకుంటే.. కాంగ్రెస్-48 శాతం, బీఆర్ఎస్-41 శాతం, బీజేపీ-06 శాతంగా ఉంది. స్మార్ట్ పోల్ సర్వే ప్రకారం కాంగ్రెస్- 48.2 శాతం, బీఆర్ఎస్-42.1 శాతం కాగా జన్‌మైన్ సర్వే కూడా హస్తం పార్టీ వైపే మెుగ్గు చూపింది. నాగన్న సర్వే వివరాలు చూస్తే.. కాంగ్రెస్‌కు 47 శాతం, బీఆర్ఎస్ 41 శాతం, బీజేపీ 8 శాతం ఓట్లు పడ్డాయని అంచనా వేసింది. హెచ్ఎంఆర్ సర్వే ప్రకారం.. హస్తం పార్టీకి 48.3 శాతం, బీఆర్ఎస్‌కు 43.18 శాతం, బీజేపీ 5.84 శాతం వచ్చే అవకాశముంది.

బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపినాథ్ సతీమణి సునీత పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి దీపక్ రెడ్డి బరిలో నిలిచారు. ఎంఐఎం పార్టీ అధికార కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది.

జూబ్లీహిల్స్‌లో సాయంత్రం 5 వరకు 47.16 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6లోపు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. ఈనెల 14న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు జరగనుంది.

మరోవైపు ఎన్నికల నియామ‌వ‌ళి ఉల్లంఘించిన ప‌లువురిపై కేసులు నమోదు చేశామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. బీర్ల ఐల‌య్య, రామ‌చంద్రనాయ‌క్‌, రాందాస్‌పై మ‌ధురాన‌గ‌ర్ పీఎస్‌లో కేసు నమోదు చేశారు. దాస్యం విన‌య్ భాస్కర్, మెతుకు ఆనంద్‌పై బోర‌బండ పీఎస్‌లో కేసు నమోదు అయింది. పోలింగ్‌ బూత్‌లో బీఆర్‌ఎస్‌ ఏజెంట్లను బెదిరించారని ఎంఐఎం ఎమ్మెల్యే కౌసర్ మోహినుద్దీన్‌పై కొప్పుల ఈశ్వర్ ఫిర్యాదు చేశారు. బీఆర్‌ఎస్‌ ఏజెంట్లను దౌర్జన్యంగా బయటకు పంపించారని చెప్పారు.

పోలింగ్ ముగిసిన తర్వాత యూసుఫ్‌గూడ మహబూబ్‌ ఫంక్షన్‌హాల్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. యూసుఫ్‌గూడలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ శ్రేణుల వాగ్వాదం, తోపులాట జరిగింది. ఆందోళనకు దిగిన ఇరువర్గాలకు పోలీసులు సర్ది చెప్పారు. మాగంటి సునీతను మహబూబ్ ఫంక్షన్‌హాల్ నుంచి పంపించారు. పాడి కౌశిక్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More