మండలిలో కల్వకుంట్ల కవిత కంటతడి.. కొత్త పార్టీగా మారుతున్న తెలంగాణ జాగృతి
తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ రానుంది. కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టనున్నట్టుగా క్లారిటీ ఇచ్చారు. మండలిలో మాట్లాడుతూ.. ఆమె భావోద్వేగానికి గురయ్యారు.
శాసనమండలిలో కల్వకుంట్ల కవిత కంటతడి పెట్టుకున్నారు. ఇదే తన చివరి ప్రసంగం అని భావోద్వేగానికి గురయ్యారు. ఒక వ్యక్తిగా బయటకు వెళ్తున్నానని చెప్పి.. బలమైన శక్తిగా మళ్లీ చట్ట సభల్లోకి వస్తానని శపథం చేశారు. తన రాజీనామాను ఆమోదించాలని మండలి ఛైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు.

మండలిలో కవిత మాట్లాడుతూ భావోద్వేగానిగి గురయ్యారు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత 2014లో జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ నిర్వహించామన్నారు కవిత. అప్పటి నుంచి ఇక తనపై ఆంక్షలు మెుదలైనట్టుగా తెలిపారు. వ్యక్తి స్వే్చ్ఛను ఎలా హరిస్తారనే బాధ, ఆవేదనతో ఈ మాటలు మాట్లాడుతున్నట్టుగా చెప్పారు.
బీఆర్ఎస్‌లో తనకు ఏ బాధ్యత ఇచ్చినా మనస్ఫూర్తిగా పనిచేసినట్టుగా కవిత గుర్తుచేసుకున్నారు. పార్టీలో ప్రశ్నిస్తే.. తనపై కక్షగట్టారన్నారు. అక్కడ అంతర్గత ప్రజాస్వామ్యం లేకుంటే.. ఇక రాష్ట్రంలో ఎలా ఉంటుదని ప్రశ్నించారు. పార్టీలో తననకు ఘోరంగా అవమానించిందన్నారు. ఈడీ, సీబీఐలతో పోరాడే సమయంలో తనకు అండగా నిలవలేదన్నారు. కేసీఆర్‌పై కక్షతో బీజేపీ తనను జైలులో పెట్టిందని వ్యాఖ్యానించారు.
'కేసీఆర్‌ను కాపాడుకోలేని పార్టీ ఉంటే ఎంత? పోతే ఎంత? హరీశ్ రావు అవినీతి పరుడు. బీఆర్ఎస్ పార్టీ రాజ్యాంగం పెద్ద జోక్. పార్టీ నడిపే పద్ధతి ఇది కాదు. నైతికత లేని పార్టీ బీఆర్ఎస్. కనీసం సంజాయిషీ కూడా అడగకుండా నన్ను సస్పెండ్ చేశారు. నా ఇద్దరి కొడుకుల మీద ఒట్టు వేసి చెప్తున్న.. బీఆర్ఎస్‌తో నాది ఆస్తుల పంచాయితీ కాదు. ఆత్మగౌరవ పంచాయితీ.' అని కవిత వ్యాఖ్యానించాలు.
పార్టీ, ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ప్రశ్నించా అని కల్వకుంట్ల కవిత అన్నారు. అమరువీరుల స్తూపం మొదలు కలెక్టరేట్ల వరకు అన్ని నిర్మాణాల్లోనూ అవినీతి జరిగిందని ఆరోపించారు. సిద్దిపేట, సిరిసిల్లలో కట్టిన కలెక్టరేట్లు ఒక్క వర్షానికి మునిగిపోయాయని చెప్పారు. ఇసుక దందాల కోసమే నేరెళ్ల దురాగతం జరిగిందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా బోధన్ షుగర్ ఫ్యాక్టరీ తెరవకపోవడం అవమానకరం అని చెప్పారు.
తెలంగాణలో కొత్త రాజకీయ వేదిక రాబోతోందని కల్వకుంట్ల కవిత ఈ సందర్భంగా చెప్పారు. రాజకీయ పార్టీగా తెలంగాణ జాగృతి మారుతుందన్నారు. ఉద్యమ ద్రోహులకు బీఆర్ఎస్ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు, అన్ని వర్గాల కోసం పని చేస్తానని స్పష్టం చేశారు. 'అవమానభారంతో పుట్టింటి నుంచి అన్ని బంధనాలు తెంచుకుని మీ కోసం వస్తున్నా.. ఆశీర్వదించండి. తెలంగాణ జాగృతి.. రాజకీయ పార్టీగా మారుతుంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాం. గొప్ప రాజకీయ శక్తిగా ఎదుగుతాను. వ్యక్తిగా సభ నుంచి వెళ్తున్నాను.. రాజకీయ శక్తిగా తిరిగి వస్తాను.' అని కవిత మాట్లాడారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


