బీఆర్ఎస్‌లో హరీశ్ ఓ గుంపును తయారు చేస్తున్నారు : మరోసారి కవిత ఫైర్
కృష్ణా నీటిపై ప్రభుత్వం అబద్ధాలు చెప్పిందని కల్వకుంట్ల కవిత అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావుపై విమర్శలు గుప్పించారు.
సూర్యాపేటలో కల్వకుంట్ల కవిత విలేకర్లతో మాట్లాడారు. అసెంబీలో ప్రతిపక్షం లేకుండా కృష్ణానీటిపై ప్రభుత్వం అబద్ధాలు చెప్పిందని విమర్శించారు. వ్యక్తిగతంగా హరీశ్ రావును ఒక్క మాట అన్నారని అసెంబ్లీని బాయ్‌కాట్ చేస్తారా అని ప్రశ్నించారు. తర్వాతైనా అసెంబ్లీకి రావొచ్చు కదా అన్నారు. మిగతా బిల్లులపై చర్చ జరుగుతుంటే.. ప్రతిపక్షం ఉండొద్దా అని అడిగారు. సభ నుంచి వాకౌట్ చేయాలనే.. నిర్ణయం హరీశ్ రావుదేనా అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో హరీశ్ ఓ గుంపును తయారు చేస్తున్నారని కవిత ఆరోపించారు. బాయ్‌కాట్ నిర్ణయం అధిష్టానానిదే అయితే.. అది మంచిది కాదని విమర్శించారు.

'బయట సభలు పెడుతూ చట్టసభల్లో మాట్లాడే అవకాశం వదులుకోవడం కరెక్ట్ కాదు. కృష్ణా పంపకాల్లో హక్కులు తగ్గించి హరీశ్ సంతకం ఎందుకు పెట్టారు. అది చెప్పి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయాల్సింది. హరీశ్ ధనదాహం కోసమే జూరాల నుంచి శ్రీశైలానికి మార్పులు జరిగాయి. హరీశ్ నిర్ణయాలతో సాగునీటి ప్రాజెక్టులకు తీవ్ర నష్టం జరిగింది.' అని కవిత విమర్శలు చేశారు.
కేసీఆర్ తప్పులు చేశారనే వాదన తప్ప కృష్ణానది నీటి వాటాపై చర్చ లేదని కల్వకుంట్ల కవిత చెప్పారు. ఆల్మట్టి ఎత్తు పెంచుకుంటే ఉత్తరం రాసి.. వదిలేశారని ఆరోపణలు చేశారు. కృష్ణా నదిపై చిత్తశుద్ధి ఉంటే.. ఎందుకు సమగ్ర చర్చ జరపడం లేదని అన్నారు. తుంగభద్ర, కృష్ణా నీటిపై కర్ణాటకతో సమస్య ఉంటే.. రెండు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎందుకు పరిష్కరించడం లేదన్నారు. గత ప్రభుత్వంపై నిందలు వేస్తూ.. తప్పులను కప్పిపుచ్చుకోవడానికి సీఎం రేవంత్ ప్రయత్నిస్తున్నారన్నారు. చిత్తశుద్ధి ఉంటే.. కర్ణాటక అప్పర్ భద్ర ప్రాజెక్టు జాతీయ హోదా తొలగించాలన్నారు. ఆల్మట్టి ఎత్తు తగ్గించాలని తీర్మానం చేయాలన్నారు.
'గుంటనక్క హరీశ్ రావు వ్యవహారం తోక కుక్కను ఊపినట్లుగా ఉంది. కృష్ణా పంపకాల్లో హక్కులు తగ్గించి హరీశ్ సంతకం ఎందుకు పెట్టాడు చెప్పి.. పీపీటీ చేయాలి. హరీశ్ రావు ధన దాహం కోసమే జూరాలా శ్రీశైలానికి ప్రాజెక్టును మార్చారు. హరీశ్ రావు నిర్ణయాలతోనే సాగునీటి ప్రాజెక్టులకు తీవ్ర నష్టం జరిగింది.' అని కవిత అన్నారు.
కురచ స్వభావంతో గత ప్రభుత్వంపై నిందలు వేస్తూ.. తమ తప్పులను కప్పిపుచ్చుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై కవిత మండిపడ్డారు. చిత్తశుద్ధి ఉంటే.. కర్ణాటక అప్పర్ భద్ర జాతీయ హోదా తొలగించాలన్నారు. ఆల్మట్టి ఎత్తు తగ్గించాలనే.. అంశంపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.
'కృష్ణా నది నీటిపై వాటాపై చర్చ పెట్టడం లేదు. ఆల్మట్టి ఎత్తు పెంచుకుంటే ఉత్తరం రాసి వదిలేశారు. కృష్ణా నీటిపై చిత్తశుద్ధి ఉంటే ఎందుకు సమగ్ర చర్చ జరపడం లేదు. తుంగభద్ర, కృష్ణా నీటిపై కర్ణాటకతో పేచీ ఉంటే.. రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా.. ఎందుకు పరిష్కరించడం లేదు.' అని కవిత విమర్శించారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


