BRS Party : బీఆర్ఎస్ ‘డిజిటల్’ స్ట్రాటజీ - పార్టీ నేతలతో కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష..! 71 వేల మంది కార్యకర్తలకు శిక్షణ

KCR On BRS Membership Drive : బీఆర్ఎస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు అధినేత కేసీఆర్ సరికొత్త కార్యాచరణ ప్రకటించారు. 35 వేలకు పైగా పోలింగ్ బూత్‌లలో డిజిటల్ సభ్యత్వ నమోదు కోసం భారీగా శిక్షణా శిబిరాలు నిర్వహించనున్నారు.

Published on: May 13, 2026, 06:12:28 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

BRS Membership Drive 2026 : పార్టీ యంత్రాంగాన్ని ఆధునీకరించేందుకు భారత రాష్ట్ర సమితి (BRS) సిద్ధమైంది. పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మంగళవారం పార్టీ ప్రధాన కార్యదర్శుల సమావేశం అత్యంత కీలకమైన నిర్ణయాలను తీసుకుంది. దాదాపు ఆరు గంటల పాటు సాగిన ఈ సుదీర్ఘ భేటీలో పార్టీ భవిష్యత్తు… సభ్యత్వ నమోదు ప్రక్రియపై స్పష్టమైన రోడ్ మ్యాప్‌ను కేసీఆర్ ఖరారు చేశారు.

పార్టీ నేతలతో కేసీఆర్
పార్టీ నేతలతో కేసీఆర్

డిజిటల్ బాటలో గులాబీ దళం

ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ECI) ప్రస్తుతం ఓటర్ల జాబితా సవరణ వంటి కార్యక్రమాలను పూర్తిస్థాయిలో డిజిటల్ విధానంలో నిర్వహిస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదును కూడా ఇకపై పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్ చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. దీనికోసం ప్రతి నియోజకవర్గానికి రాష్ట్ర కమిటీ నుంచి ఒక సభ్యత్వ సమన్వయకర్తను నియమిస్తారు. రాబోయే రెండు మూడు రోజుల్లోనే మండలాలు, మున్సిపల్ బాడీల వారీగా సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలని పార్టీ నిర్ణయించింది.

71,310 మంది కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ

డిజిటల్ సభ్యత్వ నమోదు కేవలం పేరుకే కాకుండా, పక్కాగా సాగేలా చూడాలని కేసీఆర్ ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 35,655 పోలింగ్ బూత్‌లలో బూత్‌కు ఇద్దరు చొప్పున మొత్తం 71,310 మంది కార్యకర్తలను ఎంపిక చేసి,,,, వారికి డిజిటల్ ప్రక్రియపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణా శిబిరాల పర్యవేక్షణ బాధ్యతలను పార్టీ ప్రధాన కార్యదర్శులకు అప్పగించారు.

జిల్లాల వారీగా ఇంచార్జీల నియామకం

సభ్యత్వ నమోదు కార్యక్రమం సజావుగా సాగేలా చూడటానికి సీనియర్ నేతలకు జిల్లాల బాధ్యతలను అప్పగించారు.

  • ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలు - తక్కళ్లపల్లి రవీందర్ రావు, ఎమ్మెల్సీ, ప్రధాన కార్యదర్శి.
  • జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలు – జీవన్ రెడ్డి, మాజీ మంత్రి, ప్రధాన కార్యదర్శి.
  • ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలు – సత్యవతి రాథోడ్, మాజీ మంత్రి, ప్రధాన కార్యదర్శి.
  • జనగాం, హనుమకొండ, వరంగల్ జిల్లాలు - పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే, ప్రధాన కార్యదర్శి.
  • మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాలు - గ్యాదరి బాలమల్లు, ప్రధాన కార్యదర్శి.
  • నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు - గంగాధర్ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ, ప్రధాన కార్యదర్శి.
  • మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలు - నారదాసు లక్ష్మణ్ రావు, మాజీ ఎమ్మెల్సీ, ప్రధాన కార్యదర్శి.
  • ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలు - రావుల శ్రావణ్ కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి.
  • వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలు - సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే.
  • మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలు — మహమూద్ అలీ, మాజీ మంత్రి.
  • గద్వాల్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాలు — మెట్టు శ్రీనివాస్, కార్యదర్శి.
  • మేడ్చల్-మల్కాజిగిరి, యాదాద్రి జిల్లాలు — పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ, డిప్యూటీ ఫ్లోర్ లీడర్.
  • హైదరాబాద్ జిల్లా — తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే.
  • నల్గొండ, సూర్యాపేట జిల్లాలు — ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి.

ఈ నియామకాల ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్‌ను ఉత్తేజితం చేసి, సభ్యత్వ నమోదులో కొత్త రికార్డులు సృష్టించాలని కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారు. అధునాతన సాంకేతికతను వాడుకుంటూనే…. ప్రతి గడపకు పార్టీని తీసుకెళ్లేలా ఈ వ్యూహాన్ని రూపొందించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More