BRSలో భారీ మార్పులు - కమిటీలన్నీ రద్దు చేసిన కేసీఆర్..! పార్టీ సమావేశంలో కీలక నిర్ణయాలు

BRS State Executive Committee Meeting : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.  రాష్ట్ర కమిటీ మినహా అన్ని స్థాయిల కమిటీలను రద్దు చేశారు. పునర్నిర్మాణ బాధ్యతలను కేటీఆర్‌కు అప్పగించారు. పార్లమెంట్‌లో తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడటంలో కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు విఫలమయ్యారని మండిపడ్డారు.

Published on: Apr 27, 2026, 17:55:38 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

BRS State Executive Committee Meeting : భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్… పార్టీని సంస్థాగతంగా ప్రక్షాళన చేసే పనిలో పడ్డారు. సోమవారం జరిగిన పార్టీ అంతర్గత సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ ప్రక్షాళనతో పాటు చేపట్టాల్సిన పోరాటాలపై దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి తీసుకువాల్సిన చర్యలపై సూచనలు చేశారు. ఇందులో భాగంగా రాష్ట్ర కమిటీ మినహా అన్ని స్థాయిల కమిటీలను రద్దు చేశారు. పునర్నిర్మాణ బాధ్యతలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అప్పగించారు.

పార్టీ అంతర్గత సమావేశంలో కేసీఆర్
పార్టీ అంతర్గత సమావేశంలో కేసీఆర్

పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని కేసీఆర్ ఆదేశించారు. కేవలం బుక్ ద్వారానే కాకుండా, ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ విధానాల్లో సభ్యత్వాలు నమోదు చేయాలని సూచించారు.అలాగే ఇటీవలే పార్టీలో చేరిన జీవన్ రెడ్డిని పార్టీ జనరల్ సెక్రటరీగా నియమిస్తూ కార్యవర్గానికి పరిచయం చేశారు.

ప్రభుత్వంపై కేసీఆర్ ఫైర్….

కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. తమ హయాంలో తెలంగాణను వ్యవసాయంలో నెంబర్ వన్ గా నిలబెడితే…. ప్రస్తుత ప్రభుత్వం భూముల కబ్జాల్లో, కూలగొట్టడాల్లో నెంబర్ వన్ గా ఉందని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు చేయలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని, కొనుగోళ్లు లేక రైతులు పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే బాధ కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం ఎలాగైతే ఆంక్షలు లేకుండా ధాన్యం కొనుగోలు చేసిందో…. ఇప్పుడు కూడా అలాగే చేయాలన్నారు. లేదంటే ఊరూరా ఉద్యమిస్తామని హెచ్చరించారు.

బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య తెలంగాణ పట్ల అవమానకరంగా మాట్లాడినప్పుడు రాష్ట్రంలోని కాంగ్రెస్, బిజెపి ఎంపీలు మౌనంగా ఉండటాన్ని కేసీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. "తెలంగాణ కాంగ్రెస్, బిజెపి ఎంపీలు ఇక్కడ పుట్టలేదా? వారికి తెలంగాణ పౌరుషం లేదా?" అని ఆయన ప్రశ్నించారు. అదే ఒక్క బీఆర్ఎస్ ఎంపీ ఉన్నా…. క్షమాపణ చెప్పించే వరకు పోరాడేవాళ్లమని గుర్తు చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More