రెండేండ్లు ఓపిక పట్టినం.. ఇగ ఊరుకునేది లేదు : కేసీఆర్

పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌పై ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. తనను దూషించడమే రాష్ట్ర ప్రభుత్వ విధానంగా ఉందన్నారు.

Published on: Dec 21, 2025, 17:10:56 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్షం, రాష్ట్ర కార్యవర్గ భేటీ తెలంగాణ భవన్‌లో జరిగింది. ఇందులో భాగంగా కీలక విషయాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చర్చించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కీలక నేత హరీశ్ రావు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యవర్గసభ్యులు హాజరు అయ్యారు.

కేసీఆర్
కేసీఆర్

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. పార్టీ గుర్తులతో జరిగితే బీఆర్ఎస్ సత్తా తెలిసేదన్నారు. పార్టీ గెలుపునకు కృషి చేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. గర్వంతో ఎగిరిపడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెప్పారన్నారు. మేం అధికారంలో ఉన్నప్పుడు.. అహంకార వైఖరి ప్రదర్శించలేదన్నారు. కాంగ్రెస్ ఒక కొత్త పాలసీ కూడా తేలేదని చెప్పారు. తీసుకొచ్చిన పాలసీ.. రియల్ ఎస్టేట్ కోసమేనని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజల ఆస్తుల విలువ పూర్తిగా తగ్గిందన్నారు.

అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండేండ్లు ఓపిక పట్టినమని కేసీఆర్ చెప్పారు. ఇగ ఊరుకునేది లేదన్నారు. రాజకీయాల్లో గెలుపులు, ఓటములు ఉండటం సహజం అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాల మార్పిడులు ఉంటాయి.. కానీ ఎంత సక్సెస్‌ఫుల్‌గా గవర్నమెంట్‌ను నడిపామో అది ముఖ్యం అన్నారు. తమ ప్రభుత్వం పోయిన తర్వాత పాలమూరు ఎత్తిపోతల పథకంలో కనీసం ఒక తట్టెడు మట్టి కూడా తీయలేదన్నారు. మరి దాన్ని ఎందుకు వదిలిపెట్టిర్రో.. దాని వెనక ఉద్దేశం ఏంటో అని ప్రశ్నించారు. మధ్యలో కేంద్ర ప్రభుత్వం బీజేపీతో ఓ తమాషా అని కేసీఆర్ అన్నారు. మెుదటి నుంచి తెలంగాణకో శని అయిందని కామెంట్ చేశారు.

'కేంద్ర ప్రభుత్వం ప్రతీ విషయాన్ని వ్యతిరేకించడమే. చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో చేరడం.. ఆయన మాటలు పట్టుకుని ప్రతీ దాన్ని అడ్డంగా వ్యతిరేకించడమే. మేం ఉన్నన్ని రోజులు బాగా కొట్లాడినం. అనేకమైన పోరాటాలు చేశాం. పోరాటాలతో ఎప్పటికప్పుడు అనుమతులు సాధించుకున్నాం. కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు ఎంపీల అవసరం ఉంది కదా. అందుకోసం బీజేపీ ఎంతకైనా దిగజారుతుంది.' అని కేసీఆర్ అన్నారు.

తమ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులు పండించిన పంట కొనకపోతే.. ఎమ్మెల్యేలు, మంత్రులు ఢిల్లీకి వెళ్లి.. కేంద్రం మెడలు వంచామని కేసీఆర్ అన్నారు. ఢిల్లీలో 80 లక్షల టన్నులు మేం తీసుకుంటామన్నారు. వడ్లు కొనకపోతే.. మేమంతా హడావుడి చేసి పోయినమని, కానీ ప్రధానమైన మూడు జిల్లాలకు సంబంధించిన ప్రాజెక్టు డీపీఆర్ వాసప్ పంపిస్తే.. వీళ్లు చడీచప్పుడు లేదని విమర్శించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More