ఫోన్ ట్యాపింగ్ కేసు : 'విచారణకు మరో తేదీని తెలపండి' - సిట్ నోటీసులకు రిప్లై ఇచ్చిన కేసీఆర్‌

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులపై కేసీఆర్ స్పందించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బిజీ షెడ్యూల్ కారణంగా విచారణను రీషెడ్యూల్ చేయాలని కోరారు.

Published on: Jan 30, 2026, 24:26:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఫోన్ ట్యాపింగ్ కేసులో శుక్రవారం విచారణకు హాజరుకావాలంటూ సిట్ ఇచ్చిన నోటీసులపై కేసీఆర్ స్పందించారు. విచారణను రీషెడ్యూల్ చేయాలని కోరారు. మున్సిపల్‌ ఎన్నికలు ఉన్నందున సమయం ఇవ్వాలని కోరారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోనే విచారించాలని… విచారణకు సహకరిస్తానని స్పష్టం చేశారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాశారు.

మాజీ సీఎం కేసీఆర్
మాజీ సీఎం కేసీఆర్

మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా సిట్ ముందుకు రాలేను. అభ్యర్థుల జాబితా ఖరారు చేసే పనిలో బిజీగా ఉన్నాను. విచారణ కోసం మీకు అనువుగా ఉన్న మరో తేదీని తెలుపగలరు” అని సిట్ కు రాసిన లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు.

ప్రస్తుతం మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలకు నామినేషన్లు జరుగుతున్నాయి. 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు నామినేషన్లు దాఖలు చేయడానికి శుక్రవారం చివరి తేదీ. ఈ దృష్ట్యా, పార్టీ ప్రాతిపదికన ఎన్నికలు జరుగుతున్నందున చాలా మందికి భీఫారమ్ లు అందజేసే పనుల్లో ఉన్నాను" అని కేసీఆర్ తన లేఖ ద్వారా సమాచారం ఇచ్చారు.

మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ లేఖపై సిట్ కూడా స్పందించింది. కేసీఆర్‌కు సమయం ఇవ్వాలని సిట్‌ నిర్ణయించింది. తదుపరి విచారణ తేదీని ప్రకటించే అవకాశం ఉంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More