నేను ఉన్నంతకాలం కేసీఆర్‌కు అధికారం దక్కనివ్వను.. ఇదే నా శపథం : సీఎం రేవంత్ రెడ్డి

తాను రాజకీయాల్లో ఉన్నంతకాలం కేసీఆర్‌కు అధికారం దక్కనివ్వనని సీఎం రేవంత్ రెడ్డి శపథం చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్‌, ఉపఎన్నికలు అన్నింట్లోనూ బీఆర్ఎస్‌ను ఓడించామని చెప్పారు.

Published on: Dec 24, 2025, 18:55:54 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

2029లో 80 శాతానికి పైగా సీట్లతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తాను రాజకీయాల్లో ఉన్నంతకాలం కల్వకుంట్ల కుటుంబాన్ని అధికారంలోకి రానివ్వనని కొడంగల్ కోస్గి సభలో శపథం చేశారు. సంపదలో వాటా ఇవ్వాల్సి వస్తుందనే సొంత బిడ్డను, అల్లుడిని వెల్లగొట్టారని తీవ్రమైన కామెంట్స్ చేశారు. కేటీఆర్‌పై కూడా తీవ్రంగా కామెంట్స్ చేశారు సీఎం.

కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి విమర్శలు
కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి విమర్శలు

'నేను ఉన్నంతకాలం కేసీఆర్‌కు అధికారం దక్కనివ్వను.. ఇదే నా శపథం. కల్వకుంట్ల కుటుంబాన్ని మళ్లీ అధికారంలోకి రానివ్వను. అసెంబ్లీ, పార్లమెంట్‌, ఉపఎన్నికలు.. అన్నింట్లోనూ ఓడించాం . పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను పాతరేశాం. ఇన్నిసార్లు ఓడించినా.. ఇంకా నాదే పైచేయి అంటారా?. 2029లో అధికారం ముమ్మాటికీ కాంగ్రెస్‌దే. రెండోసారి కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయం. కేసీఆర్‌ కోరినన్ని రోజులు అసెంబ్లీ పెడతా. కేసీఆర్‌ అసెంబ్లీకి వస్తే.. ఏం అంశంపైనైనా చర్చిద్దాం.' అని రేవంత్ రెడ్డి అన్నారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ పక్కా అని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. 2029లో 119 సీట్లే ఉంటే 80కి పైగా సాధిస్తామన్నారు, అదే నియోజకవర్గాల పునర్విభజనతో 153 అయితే 100కుపైగా గెలుస్తామని వ్యాఖ్యానించారు. చంద్రశేఖర్ రావు, హరీశ్ రావు, దయాకర్ రావుతోపాటుగా బీఆర్ఎస్‌లో ఉన్న రావులంతా రాసి పెట్టుకోండని అన్నారు. బీఆర్ఎస్, కేసీఆర్ చరిత్ర ఖతమేనని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవిష్యత్తు కాంగ్రెస్ అని గత చరిత్రతో ఒరిగేదేమీ లేదని చెప్పారు.

పాలమూరు, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు వంటి కీలక నీటిపారుదల ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉండగా.. కల్వకుంట్ల కుటుంబం కమీషన్ల ద్వారా అపారమైన సంపదను కూడబెట్టుకుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. గత దశాబ్ద కాలంగా కాంట్రాక్టర్లకు రూ.1.83 లక్షల కోట్లు చెల్లించినప్పటికీ, కొడంగల్‌కు నీరు చేరకుండా అడ్డుకున్నారని విమర్శించారు. ఒకప్పుడు పేదలుగా ఉన్న కల్వకుంట్ల కుటుంబ సభ్యులు ఇప్పుడు లగ్జరీ కార్లను కలిగి ఉన్నారని చెప్పారు. రాష్ట్ర హోదా, గౌరవాన్ని పెంచడానికి తాను రోజుకు 18 గంటలు పనిచేస్తానని పేర్కొన్నారు.

'అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించాం. పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చాం. కంటోన్మెంట్‌లో బండకేసి కొట్టాం. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బోరబండలో బండ కింద పాతిపెట్టినం. 12726 పంచాయతీల్లో 8335 మంతి సర్పంచ్‌లను గెలిపించుకున్నాం. ఇన్నిసార్లు ఓడిన తర్వాత కూడా నాదే పైచేయి అంటున్నారు. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో తేల్చుకుందాం రండి. ఇప్పటికైనా కేసీఆర్ వయసుకు గౌరవం ఇస్తు్న్నాం. ఈ నెల 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు. అక్కడ చర్చిద్దాం. అసెంబ్లీలో చర్చించకుండా ఫాంహౌస్‌లోకి నిద్రపోయి ఖాళీగా ఉన్నప్పుడు ఆఫీసుకు వచ్చి ప్రెస్‌మీట్లు పెట్టడం కాదు. నిజమైన చర్చ అసెంబ్లీలో చేద్దాం. ప్రజలు వింటారు.' అని రేవంత్ రెడ్డి అన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More