Kendriya Vidyalaya Recruitment : దుండిగల్ కేంద్రీయ విద్యాలయలో ఉద్యోగాలు - కేవలం ఇంటర్వ్యూనే, తేదీ ఇదే

Kendriya Vidyalaya Dundigal Recruitment : మేడ్చల్ మల్కాజ్‌గిరి పరిధిలోని దుండిగల్ కేంద్రీయ విద్యాలయంలో ఒప్పంద ప్రాతిపదికన 8 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 13వ తేదీన వాక్-ఇన్ ఇంటర్వ్యూలు జరుగుతాయి.

Published on: Oct 12, 2026, 11:13:47 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Kendriya Vidyalaya Dundigal Recruitment : కేంద్రీయ విద్యాలయ సంస్థాన్ (KVS) పరిధిలోని దుండిగల్ కేంద్రీయ విద్యాలయంలో (నంబర్ 1) వివిధ బోధన, బోధనేతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు నేరుగా వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు.

దుండిగల్ కేంద్రీయ విద్యాలయలో ఉద్యోగాలు
దుండిగల్ కేంద్రీయ విద్యాలయలో ఉద్యోగాలు

ఖాళీల వివరాలు….

ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ - జియోగ్రఫీ & హిస్టరీ), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ - మ్యాథ్స్ & స్పెషల్ ఎడ్యుకేటర్), ప్రైమరీ టీచర్స్ (పీఆర్‌టీ-టిఎస్), స్టాఫ్ నర్స్ (మహిళ), స్పోర్ట్స్ కోచ్, సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనర్ (మహిళ), మ్యూజిక్ కోచ్, కౌన్సెలర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

  1. పీజీటీ (PGT ): గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత సబ్జెక్టులో కనీసం 50 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ లేదా ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ (బీఈడీతో సహా) పూర్తి చేసి ఉండాలి. లేదా కనీసం 50 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీతో పాటు బీఈడీ కలిగి ఉండాలి. అలాగే మూడేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ-ఎంఈడీ లేదా నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ (50% మార్కులతో) చేసిన వారు కూడా అర్హులే.
  2. టీజీటీ (TGT) : కనీసం 50 శాతం మార్కులతో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సు (బీఈడీతో సహా) లేదా కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్ / ఆనర్ డిగ్రీ చేసి ఉండాలి. దీనితో పాటు బీఈడీ అర్హత తప్పనిసరి. టీజీటీ (స్పెషల్ ఎడ్యుకేటర్): కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ (స్పెషల్ ఎడ్యుకేషన్) పూర్తి చేయాలి. లేదా 50 శాతం మార్కులతో జనరల్ బీఈడీ తో పాటు ఏడాది స్పెషల్ ఎడ్యుకేషన్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
  3. పీఆర్‌టీ (PRT): కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ పూర్తి చేసి, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో రెండేళ్ల డిప్లొమా లేదా నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కలిగి ఉండాలి.
  4. స్టాఫ్ నర్స్ (మహిళ): సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ పూర్తి చేసి, నర్సింగ్‌లో మూడేళ్ల డిప్లొమా లేదా బీఎస్సీ నర్సింగ్ తో పాటు లైఫ్ సేవింగ్ స్కిల్స్ సర్టిఫికేట్ ఉండాలి.
  5. కౌన్సెలర్: కనీసం 50 శాతం మార్కులతో బీఏ లేదా బీఎస్సీ సైకాలజీ చేసి, కౌన్సెలింగ్‌లో డిప్లొమా కోర్సు పూర్తి చేసి ఉండాలి.
  6. స్పోర్ట్స్ కోచ్ : ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు రాష్ట్ర లేదా జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొన్న అనుభవం, కోచ్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి. ఎన్‌ఐఎస్ సర్టిఫికేట్ ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
  7. మ్యూజిక్ కోచ్ : కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ పూర్తి చేసి, సంగీతం లేదా పెర్ఫార్మింగ్ ఆర్ట్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి.
  8. సెల్ఫ్ డిఫెన్స్ కోచ్ : సెల్ఫ్ డిఫెన్స్ లేదా మార్షల్ ఆర్ట్స్ విభాగాల్లో డిగ్రీ, డిప్లొమా లేదా సర్టిఫికేట్ కోర్సు కలిగి ఉండాలి.

అభ్యర్థులు ముందుగా ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్ సమర్పించాల్సి ఉంటుంది. అక్టోబర్ 13వ తేదీన వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. అభ్యర్థుల ఇంటర్వ్యూలు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ no1dundigal.kvs.ac.in ను సందర్శించవచ్చు.

  • ఇంటర్వూ తేదీ - 13, అక్టోబర్ 2026
  • ఇంటర్వ్యూ జరిగే చిరునామా - PM SHRI Kendriya Vidyalaya, నెంబర్ 1 AFA దుండిగల్, హైదరాబాద్ - 500043
  • అధికారిక వెబ్ సైట్ - https://no1dundigal.kvs.ac.in/en/

ఈ లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలను తెలుసుకోవచ్చు

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More