...
...
Next Story

Exams : తెలంగాణ విద్యార్థులకు అలర్ట్.. 1 నుంచి 9 తరగతుల పరీక్షల తేదీల్లో మార్పు

Telangana Exams : 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చింది. వారికి జరగాల్సిన పరీక్షల తేదీల్లో మార్పులు జరిగాయి. ఈ విషయాన్ని గమనించాలి.

Updated on: Apr 03, 2026 07:02 AM IST
Advertisement

తెలంగాణలో మరికొన్ని రోజుల్లో వేసవి సెలవులు మెుదలుకానున్నాయి. అంతకుముందు విద్యార్థులకు పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే ఈ పరీక్షలపై తాజాగా కీలక అప్డేట్ వచ్చింది. ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు జరగాల్సిన సమ్మెటివ్ అసెస్‌మెంట్(ఎస్ఏ-2) పరీక్షల తేదీల్లో మార్పులు జరిగాయి.

1 నుంచి 9వ తరగతి పరీక్షలు
1 నుంచి 9వ తరగతి పరీక్షలు

ఎస్‌ఏ-2 పరీక్షలు ఈనెల 10 నుంచి 20వరకు జరగాల్సి ఉంది. కానీ తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ పరీక్షలు ఉన్నాయి. ఈ కారణంగా ఎస్‌ఏ 2 పరీక్షలు అన్ని కూడా రెండు రోజుల ముందు నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్‌ నికోలస్‌ ప్రకటించారు.

అంటే నిజానికి ఏప్రిల్ 10వ తేదీన ప్రారంభంకావాల్సిన ఈ పరీక్షలు.. ఈనెల 8న ప్రారంభవుతాయి. ఏప్రిల్‍ 18వ తేదీతో ముగుస్తాయి. ఒకటో తరగతి నుంచి 7వ తరగతికి సంబంధించిన పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 11.30వరకు జరుగుతాయి. అదే ఎనిమిదో తరగతి పరీక్షలు 9 గంటల నుంచి 11.45వరకు ఉంటాయి. ఇక 9వ తరగతి పరీక్షలు 9 గంటల నుంచి 12 వరకు జరగనున్నాయి.

వేసవి సెలవులు

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలకు అధికారికంగా వేసవి సెలవులను ప్రకటించింది. దీంతో విద్యార్థులకు ఏప్రిల్ 24 నుంచి 2026 జూన్ 11 వరకు 48 రోజుల సమ్మర్ హాలిడేస్ లభించనున్నాయి. అధికారిక ప్రకటన ప్రకారం, 2026–27 విద్యా సంవత్సరానికి పాఠశాలలు 2026 జూన్ 12న తిరిగి తెరుస్తారు. సిలబస్‌ను సకాలంలో పూర్తి చేయడానికి అవసరమైతే విద్యా సంస్థలు వారానికి అదనపు తరగతులను నిర్వహించవచ్చని అధికారులు పేర్కొన్నారు.

కొన్ని పాఠశాలలు ఎస్ఎస్‌సీ పరీక్షా కేంద్రాలుగా ఉన్నాయి. అటువంటి పాఠశాలలు పరీక్షలు జరిగే రోజుల్లో మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 5 గంటల వరకు, మిగిలిన రోజుల్లో ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పనిచేస్తున్నాయి. పదో తరగతి విద్యార్థుల కోసం నిర్వహించే ప్రత్యేక తరగతులు యథావిథిగా కొనసాగుతాయి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe