...
...
Next Story

Hyderabad Metro Pass : హైదరాబాద్ మెట్రో డైలీ, మంత్లీ పాస్‌లపై కీలక అప్డేట్

Hyderabad Metro Pass : హైదరాబాద్ మెట్రో డైలీ, మంత్లీ పాస్‌లపై కీలక అప్డేట్ వచ్చింది. ఎల్‌అండ్‌టీ హైదరాబాద్‌ మెట్రోరైలు సంస్థ ఈ విషయంపై ఆసక్తితో లేనట్టుగా తెలుస్తోంది.

Published on: Aug 13, 2026, 17:11:10 IST
Advertisement

మెట్రో రైలులో నిత్యం ప్రయాణించే వారికి మళ్లీ నిరాశే ఎదురైంది. నగరవాసులు ఎప్పటినుంచో ఆశిస్తున్న రోజువారీ, నెలవారీ పాస్‌ల విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ నిరాసక్తత వ్యక్తం చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నెట్‌వర్క్ సామర్థ్యం ప్రకారం పాస్‌లు మంజూరు చేయడం ఏ రకంగానూ సాధ్యపడదని భావిస్తోంది. ప్రస్తుత లైన్‌లలో డైలీ, మంత్లీ పాస్‌ల జారీ అసాధ్యమని ఎల్ అండ్ టీ స్పష్టం చేసింది.

హైదరాబాద్ మెట్రో
హైదరాబాద్ మెట్రో

మరోవైపు త్వరలోనే కేంద్ర మంత్రివర్గం ముందుకు మెట్రో రెండో దశ ప్రతిపాదనలు రానున్నాయి. హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రారంభమైన సమయం నుంచి సాధారణ ప్రయాణికులు పాస్‌ల సదుపాయం కోసం డిమాండ్ చేస్తూనే ఉన్నారు. గత నెల చివర్లో నిర్వహించిన హైదరాబాద్‌ మెట్రో రైలు లిమిటెడ్‌ బోర్డు సమావేశంలో హెచ్‌ఎంఆర్‌ఎల్‌ ఛైర్మన్‌ సంజయ్‌ జాజు కూడా దీనిపై సానుకూల మార్గాలను అన్వేషించాలని అధికారులను ఆదేశించారు. అయితే ప్రభుత్వం నుంచి పదే పదే ఒత్తిడి వస్తున్నప్పటికీ ఎల్ అండ్ టీ యాజమాన్యం మాత్రం పాస్‌ల విషయమై ఏ మాత్రం మెగ్గు చూపకపోవడం గమనార్హం. ప్రతిరోజూ మెట్రోలో ప్రయాణించే ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర రెగ్యులర్‌ ప్రయాణికులకు పాస్‌లు వస్తే ఎంతగానో ఉపయోగకరంగా ఉండనుంది.

ఇటీవల తెలంగాణ రవాణా సంస్థతో జరిగిన సమగ్ర చర్చలు, ఉమ్మడి టికెటింగ్ పురోగతిని సీఎస్ సమీక్షించనున్నారు. ఫేజ్-1 స్వాధీనంలో కీలకమైన ఆర్థిక వనరుల సమీకరణ ప్రక్రియను 45 రోజుల్లో ఎన్‌బీఐ క్యాప్స్ ద్వారా పూర్తి చేయడంపై నిర్ణయం తీసుకోనున్నారు.

రాబోయే రెండు నెలల్లో రెండో దశ ప్రాజెక్టు ప్రతిపాదనలు కేంద్ర మంత్రివర్గం ఆమోదానికి వెళ్లనున్నందున, దానికి సంబంధించిన అనుమతులపై సమీక్షించనున్నారు. ఇటీవల ఢిల్లీ వేదికగా కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో రాష్ట్ర సీఎస్, హెచ్‌ఎంఆర్‌ఎల్‌ ఎండీ భేటీ అయ్యారు. మొదటి దశ స్వాధీనం ఆలస్యమవడం వల్ల రెండో దశ పొడిగింపుపై పడుతున్న భారాన్ని, పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యలను కేంద్రానికి వివరించారు. మొదటి దశ ప్రాజెక్ట్ స్వాధీనాన్ని, రెండో దశ ఆమోదాలను ముడిపెట్టవద్దని కోరుతూ.. భవిష్యత్తులో మొదటి, రెండో దశల అనుసంధానానికి స్పష్టమైన ప్రణాళిక సిద్ధం చేస్తామని కేంద్రానికి అందించిన లేఖలో అధికారులు పేర్కొన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe