...
...
Next Story

TG Rythu Bharosa : రైతు భరోసా స్కీమ్ కొత్త అప్డేట్ - కొత్త దరఖాస్తులు ప్రారంభం, మీ వద్ద ఉండాల్సిన పత్రాలివే

రైతులకు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అప్డేట్ ఇచ్చింది. రైతు భరోసా స్కీమ్ కోసం కొత్తవారి నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది.28.02.2026 లోపు పట్టా బుక్ పొందిన రైతులు కొత్తగా రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది.

Published on: Mar 17, 2026 01:22 PM IST
Advertisement

రైతు భరోసా పంట పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి తేదీని కూడా ప్రకటించారు. ఈ నెల 22 నుంచి రైతుల ఖాతాల్లో రైతుభ‌రోసా నిధులు జమ చేస్తారు.

రైతు భరోసా స్కీమ్
రైతు భరోసా స్కీమ్

రైతు భరోసా నిధుల విడుదల నేపథ్యంలో రైతులకు ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. ఇప్పటి వరకు రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అందని రైతులకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. కొత్తగా పట్టా పొందిన రైతులు అంటే 28.02.2026 లోపు పట్టా పొందిన రైతులు కొత్తగా రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారులను కలిసి దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.

ఏఏ పత్రాలు ఉండాలి..?

  • పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఇవ్వాల్సి ఉంటుంది.
  • రైతు ఆధార్ కార్డుతో పాటు రైతు భరోసా అప్లికేషన్ ఫారంతో పాటు సమర్పించాలి.
  • అప్లికేషన్ ఫారంలో పూర్తి వివరాలు నింపి రైతు వేదికల వద్ద లేదా మండలాల్లోని వ్యవసాయ విస్తరణ అధికారులకు అందజేయాలి.

ఈనెల 22వ తేదీన సిద్దిపేట జిల్లా న‌ర్మెట్ట నుంచి 70 లక్షల మంది రైతులకు ఎక‌రం వ‌ర‌కు రూ.3,590 కోట్లు నిధులను రైతుల ఖాతాల్లోకి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బ‌దిలీ చేయ‌నున్నారు. గుంటల వారీగా మొదలై... ఎకరాల వరకు డబ్బులను జమ చేస్తారు.

రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ. 12,000 చొప్పున పెట్టుబడి సాయం లభిస్తుంది. ఈ మొత్తం రెండు దఫాలుగా ప్రభుత్వం ఇస్తుంది. ప్రతి విడతలో రూ. 6,000 చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. ఖరీఫ్, రబీ సీజన్ ల కోసం రైతులకు ఈ పంట పెట్టుబడి సాయం అందుతుంది

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe