Telangana Rajiv Yuva Vikasam Scheme : నిరుద్యోగ యువతకు సొంతంగా ఉపాధి మార్గాలు చూపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ‘రాజీవ్ యువ వికాసం’ పథకం కింద తొలి విడతగా అర్హులైన లబ్ధిదారులకు స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటు కోసం రూ.లక్ష వరకు ఆర్థిక సహాయం అందించేలా వేగంగా చర్యలు చేపట్టనుంది. ఈ మేరకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.
నవంబరు 19వ తేదీ ఆర్థిక సాయం…

నవంబరు 19వ తేదీ నుంచి ఈ ఆర్థిక సాయాన్ని లబ్ధిదారుల చేతికి అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల పనితీరు, సంక్షేమ పథకాల అమలుపై డిప్యూటీ మంగళవారం ఉన్నతాధికారులతో సుదీర్ఘ సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ భేటీలో సంక్షేమ పథకాల అమల్లో వేగం పెంచడం… గురుకుల విద్యాలయాల నిర్వహణ, విద్యా రంగంలో మౌలిక వసతుల కల్పన, యువతకు స్వయం ఉపాధి అవకాశాలు, స్కాలర్‌షిప్‌ల విడుదల, స్టడీ సర్కిళ్ల బలోపేతం వంటి పలు కీలక అంశాలపై ఆయా శాఖల ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు.
పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ
దరఖాస్తుల పరిశీలన, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ఏమాత్రం అక్రమాలకు తావులేకుండా చూడాలని భట్టి విక్రమార్క ఆదేశించారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ... "ప్రజాభవన్‌లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించాం. ఇందిరమ్మ రాజ్యంలో పేద, బహుజన వర్గాల సంక్షేమం, పేద విద్యార్థుల విద్యాభివృద్ధి మరియు యువతకు సొంత కాళ్లపై నిలబడేలా స్వయం ఉపాధి కల్పించడమే మా ప్రజా ప్రభుత్వ ప్రధాన ధ్యేయం," అని పునరుద్ఘాటించారు.
విద్యారంగ అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, నిధుల కొరత అనేదే లేకుండా చూస్తామని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. నవంబర్ 19 నుంచి ‘రాజీవ్ యువ వికాసం’ పథకం కింద అర్హులకు రూ.1 లక్ష వరకు స్వయం ఉపాధి ఆర్థిక సాయం అందించేలా పనులను పరుగులు తీర్పించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
{{/usCountry}}విద్యారంగ అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, నిధుల కొరత అనేదే లేకుండా చూస్తామని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. నవంబర్ 19 నుంచి ‘రాజీవ్ యువ వికాసం’ పథకం కింద అర్హులకు రూ.1 లక్ష వరకు స్వయం ఉపాధి ఆర్థిక సాయం అందించేలా పనులను పరుగులు తీర్పించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
{{/usCountry}}ఈ స్కీమ్ కింద ఇప్పటికే దరఖాస్తులను స్వీకరించారు. రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షలకుపైగా అప్లికేషన్లు అందాయి. అర్హతలకు తగ్గటుగా… అందుబాటులో ఉన్న యూనిట్లకు దరఖాస్తు చేసుకున్నారు.
ఈ స్కీమ్ కింద ఎంపికైన వారికి 7 రోజుల నుంచి 15 రోజుల వరకు ఓరియంటేషన్ తరగతులు నిర్వహిస్తారు. అనంతరం యూనిట్లు మంజూరు చేస్తారు. యూనిట్ గ్రౌండ్ చేసిన తరువాత 6 నెలల నుంచి ఏడాది వరకు శిక్షణ అందిస్తారు. స్కీమ్ అమలులో ఏమైనా ఇబ్బందులు ఉంటే జిల్లా కమిటీ పరిశీలించి... పరిష్కారం దిశగా నిర్ణయం తీసుకుంటుంది.